OM Movie: ధనుష్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. టైటిల్ మార్చేసిన మేకర్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OM Movie: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ‘అమరన్’ ఫేమ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ చుట్టూ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ‘ఓం’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను మేకర్స్ అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా టైటిల్‌ను ‘ఓ.0’ (O.M) గా మార్చబోతున్నారనే బజ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టైటిల్ విషయంలో సెన్సార్ పరమైన అభ్యంతరాలు తలెత్తడంతోనే మేకర్స్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఇలాంటి సెన్సార్ మార్పు ఇదే మొదటిసారి కాదు. గతంలో దళపతి విజయ్ నటించిన ‘జననాయగన్’ (Jana Nayagan) సినిమా విషయంలోనూ సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పాత్రకు సంబంధించిన ఒక గ్యాడ్జెట్ రిఫరెన్స్‌లో ‘OM’ అనే పదాన్ని వాడగా, సెన్సార్ అభ్యంతరాల కారణంగా దాన్ని ‘MM’ గా మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ధనుష్ సినిమా టైటిల్ విషయంలోనూ అదే సీన్ రిపీట్ అయ్యిందని చెబుతున్నారు.
Also Read
- Box Office Records: పుష్ప టూ రామాయణ.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి వేగంగా చేరిన 8 సినిమాలు ఇవే..
- NTRxTrivikram: 'గాడ్ ఆఫ్ వార్' రూమర్లకు నాగవంశీ దిమ్మతిరిగే కౌంటర్.. ఒక్క ఫ్రేమ్‌తో ఫ్యాన్స్ ఖుష్!
- Kavya Maran-Anirudh Wedding: పురోహితులు లేకుండానే పెళ్లి.. 'స్వాభిమానం' మ్యారేజ్ అంటే?.. అనిరుధ్, కావ్య వివాహ వేడుకలో ఆసక్తికర విశేషాలు!
- Kiran Abbavaram: వారి కోసమే 'రియాలిటీ' మూవీ చేశా.. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు!
అయితే, ఈ సినిమాకు అసలు ‘ఓం’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? దీనికి ఆధ్యాత్మికతకు లేదా పరమశివుడికి ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్న అభిమానుల్లో మెదులుతోంది. దీనిపై డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి గతంలో ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కథ ప్రధానంగా రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, తిరువణ్ణామలై పట్టణాల మధ్య సాగుతుందట. అంతేకాకుండా, ఇందులో హీరోయిన్ సాయి పల్లవి పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఒక ఆపరేషన్ కోడ్ నేమ్ ‘OM’ అని, కథలోని పాత్రల జీవితాల్లో ఆధ్యాత్మికతకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు ‘OM’ అనే టైటిల్ పెట్టినప్పటికీ, సెన్సార్ రూల్స్ దృష్ట్యా దాన్ని ‘O.M’ గా మారుస్తున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ టైటిల్ మార్పుపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
OM Movie: ధనుష్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. టైటిల్ మార్చేసిన మేకర్స్?
-
Box Office Records: పుష్ప టూ రామాయణ.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి వేగంగా చేరిన 8 సినిమాలు ఇవే..
-
Team India Record: టీమిండియా చరిత్రలోనే ఘోర ఓటమి.. దెబ్బకు రికార్డులు తారుమారు..
-
Jammu Kashmir: ఇద్దరు పోలీసుల దారుణహత్య.. హిజ్బుల్ టెర్రరిస్ట్ సహా ముగ్గురిపై రూ. 30 లక్షల రివార్డ్!
-
Will Young: నేను 125 పరుగులు చేసినా వేస్ట్ అయింది.. విల్ యంగ్ ఆవేదన..
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?