Site icon NTV Telugu

రజనీ, ఇళయరాజా బయోపిక్స్ పై ధనుష్ కన్ను

dhanush

dhanush

ఇటీవల కాలంలో ఇండియన్ స్ర్కీన్ పై బయోపిక్‌ ట్రెండ్‌ బాగా నడుస్తోంది. బడా బడా స్టార్స్ కూడా బయోగ్రాఫికల్ డ్రామాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ధనుష్ కన్ను కూడా ఈ బయోపిక్స్ పై పడింది. రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ధనుష్ ఇప్పటి వరకు ఎవరి బయోపిక్‌లో నటించ లేదు. అవకాశం లభిస్తే తను కూడా బయోపిక్‌లలో నటిస్తానంటున్నాడు ధనుష్. ఇటీవల తన సినిమా ‘అత్రంగి రే’ ప్రచారంలో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నకు తనకు బయోపిక్ లో నటించాలని ఉందని చెప్పాడు. అంతే కాదు అవకాశం ఇస్తే రజనీకాంత్, ఇళయరాజా బయోపిక్‌లలో నటించాలనుందని తెలియచేశాడు. వారిద్దరూ అంటే తనకు ఎంతో అభిమానమని, అందుకే వారి జీవిత చరిత్రతో కూడిన చిత్రాల్లో యాక్ట్ చేయాలనుకుంటున్నానని అన్నాడు.

https://ntvtelugu.com/minister-perni-nani-sensational-comments-about-movie-ticket-rates-issue/

ధనుష్ కోరికను తీర్చే దర్శక నిర్మాతలు ఎవరన్నది పక్కన పెడితే ధనుష్ నటించిన ‘అత్రంగి రే’ డిసెంబర్ 24న హాట్‌స్టార్‌లో ప్రదర్శితం అవుతోంది. ఆనంద్.ఎల్.రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘సర్’ లో నటిస్తున్నట్లు ప్రకటించాడు. దీనికి ముందు శేఖర్ కమ్ములతో ఓ ద్విభాషా చిత్రాన్ని ప్రకటించినా దాని అప్ డేట్ ఏవీ ఇంకా తెలియపర్చలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా? లేక క్యాన్సిల్ అయిందా? ఉంటే వెంకీ అట్లూరి సినిమాకి ముందు ఉంటుందా? లేక తర్వాత ఉంటుందా? అన్నది తెలియాల్సి ఉంది.

Exit mobile version