ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ధనుష్. బెస్ట్ యాక్టర్ గా రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ధనుష్ ఇప్పటివరకు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేసాడు. ఈసారి మాత్రం అన్ని ఇండస్ట్రీలకి కలిపి ఒకటే సినిమా, పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు ధనుష్. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి ధనుష్… రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి సూపర్ హిట్ సినిమాలకి రైటర్ గా వర్క్ చేసిన అరుణ్ మాతెశ్వరన్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. కెప్టైన్ మిల్లర్ సినిమాలో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న కెప్టైన్ మిల్లర్ సినిమాపై కోలీవుడ్ లో భారి అంచనాలు ఉన్నాయి.
సంక్రాంతి రిలీజ్ కానున్న కెప్టెన్ మిల్లర్ మూవీ ప్రమోషన్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేసిన మేకర్స్… టీజర్ ని టైటిల్ సాంగ్ ని విడుదల చేసారు. ఈ రెండు ప్రమోషనల్ కంటెంట్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ రిలీజ్ అయ్యే టైమ్ వచ్చింది. త్వరలో కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది అంటూ ధనుష్ ట్వీట్ చేసాడు. న్యూ ఇయర్ రోజున కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ రిలీజ్ చేసి 2024కి సాలిడ్ స్టార్ట్ ఇవ్వాలనేది ధనుష్ ప్లాన్. ఈ ట్రైలర్ కోసం ధనుష్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో పర్ఫెక్ట్ కట్ తో ట్రైలర్ ని వదిలితే కెప్టెన్ మిల్లర్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. కోలీవుడ్ వర్గాల ప్రకారం ధనుష్ KGF లాంటి లార్జర్ దెన్ లైఫ్ సినిమాలోనే నటిస్తున్నట్లు ఉన్నాడు. రైటర్, డైరెక్టర్ లో సత్తా ఉండాలి కానీ ఎలాంటి సీన్ ఇచ్చినా పెర్ఫార్మెన్స్ చెయ్యగల ధనుష్, కెప్టెన్ మిల్లర్ సినిమాతో ఏం చేస్తాడో చూడాలి.
Captain Miller .. Trailer soon. Pongal release. pic.twitter.com/45l4xLP5uj
— Dhanush (@dhanushkraja) December 13, 2023