Site icon NTV Telugu

Devara: ఇండియన్ స్క్రీన్ పైన ముందెన్నడూ చూడని మాస్…

Devara

Devara

కొరటాల శివ అనగానే తెలుగు కమర్షియల్ సినిమాకి మెసేజ్ రంగుని అద్దిన ఒక కొత్త రకం దర్శకుడు కనిపిస్తాడు. మాస్ అంటే అలా ఇలా కాదు కొరటాల మాస్ ఇంకో రకం. హీరో ఎక్కువగా మాట్లాడాడు, చాలా సెటిల్డ్ గా ఉంటాడు. సోషల్ కాజ్ లేకుండా ఫైట్ చేయడు, రొట్ట కొట్టుడు కూడా ఉండదు. జనాలకి మంచి చేయాలనుకునే హీరో… ప్రజలని ఇబ్బంది పెట్టే సమస్య… ఈ రెండింటి మధ్యే కొరటాల శివ సినిమా ఉంటుంది. ఎలివేషన్స్ ఇచ్చినా, లో యాంగిల్ షాట్ పెట్టినా, విజిల్ వేయించే రేంజ్ డైలాగ్ పెట్టినా అది కథలో భాగంగా మాత్రమే ఉండేలా చూసుకోవడం కొరటాల శివ స్టైల్. ‘శివ’ సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఇండియన్ సినిమాని కొత్త దారిలోకి నడిపించాడు. అందుకే ఇండియన్ సినిమా అనగానే వర్మకి ముందు వర్మకి తర్వాత అంటారు.

కొరటాల కూడా అంతే కమర్షియల్ సినిమాల్లో సోషల్ కాజ్ తీసుకోని రావొచ్చు, హీరో కాజ్ కోసం ఫైట్ చెయ్యొచ్చు అని నిరూపించాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి అలాంటి సినిమాలే చేస్తూ వచ్చిన కొరటాల శివ అపజయమే లేకుండా ఇండస్ట్రీ హిట్స్ కొట్టాడు. ఆచార్య సినిమా కారణంగా కెరీర్ పై మచ్చ పడే వరకూ తెచ్చుకున్న కొరటాల శివ, ఇప్పుడు ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ దేవర సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుందని ఇప్పటికే కొరటాల శివ చెప్పేసాడు. ఈ సినిమాలో సముద్ర వీరుడిగా కనిపించనున్న ఎన్టీఆర్ క్యారెక్టర్ ని కొరటాల శివ ఏ రేంజులో డిజైన్  చేసాడో చూడాలి. ఎందుకంటే ఎన్టీఆర్ అనగానే కొరటాల స్పెషల్ కేర్ తీసుకుంటాడు. అలాంటిది ఆచార్య తర్వాత సినిమా అంటే కొరటాల, ఎన్టీఆర్ కోసమే కాదు తన కోసం కూడా పని చేస్తాడు. ఈ ఇద్దరూ కలిసి ఏప్రిల్ 5న ఇండియన్ స్క్రీన్ పై ముందెన్నడూ చూడని మాస్ ని చూపిస్తారేమో చూడాలి.

Exit mobile version