Buchi Babu Sana: ‘ఆ విషయంలో చిరంజీవి గారు ఫోన్ చేసి తిడతారేమో అనుకున్నా’: బుచ్చిబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buchi Babu Sana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ వైడ్‌గా ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆయన ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘పెద్ది’ లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమా షూటింగ్ లొకేషన్లో జరిగిన ఒక భయానక సంఘటన గురించి షాకింగ్ విషయాలను పంచుకున్నారు. షూటింగ్ టైంలో రామ్ చరణ్ కంటికి తీవ్ర గాయం కావడంతో తాను ఎంతగానో భయపడిపోయానని, ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఎలా స్పందించారో చెప్తూ బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు.
షూటింగ్ లొకేషన్లో జరిగిన ప్రమాదం గురించి బుచ్చిబాబు మాట్లాడుతూ.. “సినిమాలోని ఒక కీలకమైన సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్ గారి కంటికి ఊహించని విధంగా గాయమైంది. ఆ దెబ్బకు ఆయన కంటి నుంచి రక్తం కారిపోయింది. అదంతా లైవ్‌లో కెమెరాలోనే రికార్డ్ అయింది. చరణ్ గారు రక్తంతో తడిచిపోవడం చూసి నాకు ఒక్కసారిగా చేతులు, కాళ్లు ఆడలేదు.. విపరీతమైన భయం వేసింది” అంటూ లొకేషన్ లో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నారు.
Also Read
ఇండస్ట్రీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానించే ఒక గ్లోబల్ స్టార్‌కు తన సెట్స్‌లో గాయం కావడంతో బుచ్చిబాబు తీవ్ర ఆందోళనకు గురయ్యారట. “చరణ్ గారికి దెబ్బ తగిలిందని తెలియగానే.. ఇంటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు ఫోన్ చేశారు. ఆ క్షణంలో నాకు గుండె ఆగినంత పనైంది. సరిగ్గా చూసుకోలేదని చిరంజీవి గారు ఫోన్ చేసి నన్ను గట్టిగా తిడతారేమో అని భయపడ్డాను” అని బుచ్చిబాబు వెల్లడించారు. అయితే ఫోన్ ఎత్తిన బుచ్చిబాబుకు మెగాస్టార్ చిరంజీవి ఊహించని షాక్ ఇచ్చారు. ఆయన బుచ్చిబాబును తిట్టకపోగా.. ఎంతో కూల్‌గా మాట్లాడారట. “ఆయన ఫోన్ చేసి అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కంగారు పడకు బుచ్చి.. ఆ గాయం అయిన వీడియో క్లిప్ ఒకసారి నాకు పంపించు అని అడిగారు” అంటూ చిరంజీవి గారు చూపించిన మెచ్యూరిటీ, సపోర్ట్‌ను చూసి తాను ఆశ్చర్యపోయానని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!