Buchi Babu: మ్యారేజ్ డే రోజు భార్యతో కాకుండా చరణ్ సినిమాతోనే.. ‘పెద్ది’ డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్ డెడికేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సినిమా ‘పెద్ది’. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. కాగా ఈ సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు చూపిస్తున్న డెడికేషన్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. తన వ్యక్తిగత జీవితాన్ని, కనీసం నిద్రను కూడా పక్కనపెట్టి సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఆయన రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బుచ్చిబాబు తన బిజీ షెడ్యూల్ చెప్పి షాక్ ఇచ్చారు.
మ్యారేజ్ డే రోజు కూడా ..
సినిమా ప్రమోషన్స్ కోసం బుచ్చిబాబు ఎంతలా కష్టపడుతున్నారో ఆయన మాటల్లోనే స్పష్టమైంది. “ఈరోజు నా వెడ్డింగ్ యానివర్సరీ (పెళ్లి రోజు).. కానీ కనీసం ఆ విషయం కూడా గుర్తులేనంత బిజీగా ఉన్నాను. గత మూడు రోజుల నుంచి అసలు తారీఖులను కూడా చూడడం లేదు. నిద్ర కూడా లేకుండా కేవలం ‘పెద్ది’ ప్రమోషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే మునిగిపోయాను” అని బుచ్చిబాబు వెల్లడించారు. ఒక దర్శకుడికి తన సినిమాపై ఉన్న ప్యాషన్, డెడికేషన్‌కు ఈ సంఘటనే ఒక నిదర్శనమని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
మీరు హిట్ అంటేనే నాకు హ్యాపీ..
తన కష్టమంతా ప్రేక్షకులు ఇచ్చే రిజల్ట్ పైనే ఆధారపడి ఉందంటూ బుచ్చిబాబు భావోద్వేగానికి గురయ్యారు. “నేను ఎంత కష్టపడ్డాను, ఎన్ని రోజులు నిద్ర లేదు అనేది ముఖ్యం కాదు. జూన్ 4న థియేటర్లలో మీరు సినిమా చూసి ‘హిట్’ అయిందని చెప్తే చాలు.. అదే నాకు అసలైన హ్యాపీనెస్, నా కష్టానికి దక్కే నిజమైన ప్రతిఫలం” అని అన్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పవర్ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని హై-వోల్టేజ్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గ్లామర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు పవర్ఫుల్ రోల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. మరి తన పెళ్లి రోజును సైతం పక్కనపెట్టి బుచ్చిబాబు పడిన కష్టానికి, రామ్ చరణ్ చూపించిన డెడికేషన్‌కు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ రాబోతుందో చూడాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!