కొరటాల శివతో ఎన్టీఆర్ దేవర సినిమా చేయాలని ఎప్పుడు డిసైడ్ అయ్యాడో తెలియదు కానీ అప్పటి నుంచి ఎన్టీఆర్ కెరీర్ లో ఊహించని టర్న్స్ కనిపిస్తున్నాయి. దేవర డిలే అవ్వడం, ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాల్సింది వాయిదా పడడం, త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా కొరటాల చేతికి వెళ్లడం… ఇలా చాలా జరిగాయి. సరేలే 2024 ఏప్రిల్ 5న దేవర సినిమా రిలీజ్ అయిపోతుంది అనుకుంటే ఆరోజున రిలీజ్ అయ్యేది పార్ట్ 1 మాత్రమే పార్ట్ 2 కూడా ఉంటుంది అంటూ బాంబ్ పేల్చాడు కొరటాల శివ. దేవర రెండు పార్ట్స్ అవ్వడంతో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు కానీ దీని వలన ఎన్టీఆర్ లైనప్ షఫుల్ అయిపోయి అభిమానుల్లో అయోమయం మొదలయ్యింది.
నవంబర్ నెలకి దేవర షూటింగ్ కంప్లీట్ అయితే డిసెంబర్ నుంచి మార్చ్ వరకూ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటాడు, ఆ తర్వాత ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ అవుతుంది… ఇదే ఎన్టీఆర్ లైనప్ అనుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ అసలు ఎవరితో అనే డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. ఎన్టీఆర్ కొరటాల కలిసి చేస్తున్న దేవర ఎన్టీఆర్ 30… మరి 31వ ప్రాజెక్ట్ అంటే వార్ 2 అవుతుందా? దేవర 2 అవుతుందా? ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ అవుతుందా? అసలు దేవర తర్వాత ఇమ్మిడియట్ గా సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా ఏది? ఒకవేళ ఈ ప్రశ్నకి సమాధానం వార్ 2 అయితే ఎన్టీఆర్ 31 వార్ 2 మూవీ అవుతుంది కానీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశం లేదు, అది 32వ సినిమా అవుతుంది. మొత్తానికి ఒక్క అనౌన్స్మెంట్ తో కొరటాల శివ ఎన్టీఆర్ లైనప్ నే మార్చేశాడు.