Devara: దేవర గ్లింప్స్.. రికార్డులు బద్దలుకొట్టడానికి రెడీగా ఉండండిరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న దేవర మొదటి భాగం.. ఏప్రిల్ 5 న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పటినుంచో దేవర గ్లింప్స్ ఎప్పుడు వస్తుంది అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
దేవర అప్డేట్ ఇవ్వమని ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ కూడా చేశారు. ఇక ఇన్నాళ్ళకు మేకర్స్.. ఫ్యాన్స్ మొర విన్నారు. ఎట్టకేలకు దేవర గ్లింప్స్ కు డేట్ ఫిక్స్ చేశారు. జనవరి 8 న దేవర గ్లింప్స్ రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరో మూడు రోజుల్లో.. భయానికే దేవుడు రాబోతున్నాడు అంటూ రాసుకొచ్చారు. ఇక పోస్టర్ లో D షేప్ లో ఉన్న కత్తిని చూపించారు. ఈ గ్లింప్స్ కోసం అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాపై మొదటి నుంచి ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ గ్లింప్స్ అప్డేట్ తో ఫ్యాన్స్.. రికార్డులు బద్దలుకొట్టడానికి రెడీగా ఉండండిరా.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ గ్లింప్స్ లో కొరటాల.. ఎన్టీఆర్ ను ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో చూడాలి.
Also Read
The Lord of Fear is coming in 3 days 🌊🌊🌊#DevaraGlimpse storming from Jan 8th. #Devara pic.twitter.com/uiQv3pdzO2
— Devara (@DevaraMovie) January 5, 2024
తాజావార్తలు
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Chanakya Niti: కింగ్ లా బతకాలా? అయితే ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ గోల్డెన్ రూల్స్ పాటించాల్సిందే!
-
Botsa Satyanarayana : కూటమి రెండేళ్ల పాలన ‘సున్నా’.. తిరుపతి సభ ఒక వెన్నుపోటు సభ
-
Modi-Trump Meet: ఫ్రాన్స్‌లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్‌హౌజ్..
-
Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!