SSMB29 : రాజమౌళి-మహేశ్ సినిమా కోసం ఇప్పుడు సినీ లోకమంతా ఎదురు చూస్తోంది. ఆ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సరే మీడియాతో పాటు సోషల్ మీడియా కోడై కూస్తోంది. అసలే జక్కన్న ఎప్పుడు ఎలాంటి ప్లానింగ్ తో సినిమాలు తీస్తారో ఊహించడం కూడా కష్టమే. ఆయన మస్తిష్కంలో ఎలాంటి ఆలోచనలు వస్తాయో చెప్పలేం. అలాంటి జక్కన్న ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ ను మహేశ్ సినిమా కోసం దించుతున్నాడంట. అతను ఎవరో కాదు దేవాకట్టా. డైలాగులు రాయడంలో దేవాకట్టాకు ప్రత్యేక స్టైల్ ఉంది. ఆటోనగర్ సూర్య, ప్రస్థానం, రిపబ్లిక్ లాంటి సినిమాలను తీశారు. ఈ సినిమాల్లో డైలాగులు ప్రేక్షకులను కట్టి పడేశాయి.
Read Also : Manchu Lakshmi : మనోజ్ ను పట్టుకుని ఏడ్చేసిన మంచులక్ష్మీ..
పాత్రల మధ్య మాటలు రాయడంలో ఆయన దిట్ట. కత్తిలాంటి డైలాగులతో సీన్ ను ఎలివేట్ చేస్తుంటారు. అందుకే ఆయన్ను రాజమౌళి తన సినిమా కోసం తీసుకున్నట్టు తెలుస్తోంది. జక్కన్న ఈ నడుమ తన సినిమాల కోసం అందరినీ మార్చేస్తున్నారు. అందులో భాగంగానే దేవాకట్టాను మార్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేవాకట్టా ఎలాంటి సినిమాను తెరకెక్కించట్లేదు. అందుకే రాజమౌళి సినిమా కోసం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి సినిమా అంటే కనీసం మూడేళ్లు దానికే కేటాయించాలి. ఆ విషయం తెలిసినా దేవకట్టా ఒప్పుకున్నాడేమో అనిపిస్తోంది. ప్రస్తుతం రాజమౌళి షూటింగ్ కోసం విదేశాల్లో ప్లానింగ్ చేస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.