Deol Family: ఈ ఇయర్ బెస్ట్ కంబ్యాక్ అంటే వీళ్లదే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ని ఖాన్ త్రయం రూల్ చేయడనికి ముందు దిలీప్ కుమార్, రాజేష్ ఖన్నా, రిషి కపూర్, రాజ్ కపూర్ లాంటి చాలా మంది స్టార్ హీరోలు బాలీవుడ్ ని ఏలారు. ఇంతమంది స్టార్ హీరోల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ధర్మేంద్ర డియోల్. ది హీమాన్ అనే పేరు తెచ్చుకున్న ధర్మేంద్ర ఆరు దశాబ్దాలుగా 300 పైగా సినిమాల్లో నటించి అభిమానులని మెప్పిస్తునే ఉన్నాడు. ఈయన నట వారసులుగా సన్నీ డియోల్, బాబీ డియోల్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఘాయల్, ఘాతక్, హిమ్మత్, డర్, బార్డర్, గదర్ లాంటి సినిమాల్లో నటించిన 1990- 2000 కాలంలో సన్నీ డియోల్ స్టార్ హీరోగా ఎదిగాడు. సన్నీ డియోల్ హిట్ స్ట్రీక్ లో ఉండగానే బాబీ డియోల్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా ‘బర్సాత్’తో సూపర్ హిట్ కొట్టాడు. సోల్జర్, బాదల్, యామ్లా పగ్లా దివానా లాంటి సినిమాతో బాబీ కూడా మంచి హిట్స్ కొట్టాడు. ఇలా డియోల్ హీరోలు బాలీవుడ్ ని మంచి సక్సస్ లో ఉన్న సమయంలో ధర్మేంద్రకి వయసు మీద పడి సినిమాలు తగ్గించడం, సన్నీ-బాబీ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ని ఇవ్వడంతో డియోల్ ఫ్యామిలీకి ఇండస్ట్రీలో కష్టాలు మొదలయ్యాయి. ఈ కష్టాలు ఆల్మోస్ట్ హీరోల కెరీర్ లకే ఎండ్ కార్డ్ వేసే వరకూ వెళ్లింది. అయితే 2023 డియోల్ హీరోలకి సాలిడ్ టర్నోవర్ గా నిలిచింది.
ముందుగా ఈ ఇయర్ ని ధర్మేంద్ర హిట్ తో మొదలుపెట్టాడు. రణ్వీర్ సింగ్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని సినిమాలో ధర్మేంద్ర మంచి రోల్ ప్లే చేసాడు. ఈ సినిమా సక్సస్ అవ్వడంతో ధర్మేంద్ర ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. ధర్మేంద్ర ఇప్పుడు మళ్లీ క్యారెక్టర్స్ తో బిజీ అయిపోయాడు. ఆ తర్వాత సన్నీ డియోల్ తన సూపర్ హిట్ సినిమా గదర్ కి సీక్వెల్ గా గదర్ 2ని చేసి బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు. సోలో హిందీ మార్కెట్ లో పఠాన్ సినిమా రికార్డులని కూడా బ్రేక్ చేసే రేంజ్ హిట్ కొట్టాడు సన్నీ డియోల్. ఇక ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న అనిమల్ సినిమాలో విలన్ గా నటించి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తున్నాడు బాబీ డియోల్. కనిపించింది కాసేపే అయినా, ఒక్క డైలాగ్ చెప్పుకున్నా కూడా ఈరోజు బాబీ డియోల్ ఇండియాలోనే హాట్ టాపిక్. అలా ఒకే ఇయర్ డియోల్ ఫ్యామిలీలోని ముగ్గురు హీరోలు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. మరి నెక్స్ట్ సినిమాలతో ఎలాంటి రిజల్ట్స్ ని సొంతం చేసుకుంటారు అనేది చూడాలి.
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
తాజావార్తలు
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ఛార్జీల్లో మార్పులు..
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
ట్రెండింగ్
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు