నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో, ఎవరినో ఒకరిని విమర్శిస్తూ సోషల్ మేడీఐలో కనిపిస్తూనే ఉంటాడు. ఇక కొన్నేళ్ల క్రితం రాజకీయాలలోకి అడుగుపెట్టి సినిమాలకు దూరమయ్యాడు గణేష్. ఆ తర్వాత రాజకీయాలు మనకు పడవు అంటూ బౌన్స్ బ్యాక్ అయ్యి ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంతో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక తాజాగా బండ్ల గణేష్ హీరోగా మారాడు. ‘డేగల బాబ్జీ’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వెంకట్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక నేడు రంజాన్ పండగను పురస్కరించుకొని ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మే 20 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నదని మేకర్స్ తెలిపారు. ఇక పోస్టర్ లో బండ్లన్న నవరసాలు పలికిస్తూ కనిపించాడు. నవరసాలతో మీ డేగల బాబ్జీ మే 20 న రానున్నాడు అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ చిత్రంతో బండ్లన్న ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
EAD MUBARAK 👏 pic.twitter.com/qjn2ZcSvmh
— BANDLA GANESH. (@ganeshbandla) May 3, 2022