బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పడుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో అమ్మడు ప్రేక్షకుల మనసులను ఏనాడో కొల్లగొట్టింది. ఇక ప్రేమించిన రణవీర్ సింగ్ ని వివాహమాడి అందరి మన్ననలు పొందింది. ఇక తాజాగా ఈ ఇద్దరు భార్యాభర్తలు నిర్మాణ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ’83’ సినిమాకు దీపికా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నది.
ఇక ఇటీవల 83 ప్రీమియర్ షో లో దీపికా డ్రెస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ముదురు ఆకుపచ్చ కలర్ డిజైనింగ్ గౌన్ లో దీపిక కేక పుట్టించింది. పెళ్లి తరువాత కూడా అమ్మడి అందం ఇసుమంతైనా తగ్గలేదు. అందాల ఆరబోత కూడా అస్సలు తగ్గిందే లేదు. ఈ వన్ పీస్ లాంగ్ డిజైనర్ గౌన్ లో ఎద అందాలను ఆరబోసి దీపికా ఆ వేడుకకు స్పెషల్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పెళ్లి అయినా హీట్ పెంచడం తగ్గించనంటుందే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.