Deepika Padukone: ప్రెగ్నెంట్ అయితే రెస్ట్ తీసుకోవాలా.. మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepika Padukone: ప్రెగ్నెన్సీ తర్వాత రెస్ట్ తీసుకుంటూ ఇంటికే పరిమితం కావాలనే ఆలోచనలో లేదట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే. కన్సీవ్ అయిన తర్వాత కూడా ‘రాకా’, ‘కింగ్’ సినిమాల షూటింగ్స్‌లో పాల్గొన్న ఈ భామ.. తనకు సంబంధించిన పోర్షన్స్‌ను ఇప్పటికే పూర్తి చేసిందని సమాచారం. అయినప్పటికీ రిలాక్స్ కాకుండా వరుస ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెడుతోందని బాలీవుడ్ వర్గాల్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది.
ఇటీవల కెరీర్‌కు సంబంధించిన పలు వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టి.. సినిమాలపై మరింత దృష్టి సారిస్తోంది దీపిక. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’, ‘కల్కి 2’ సినిమాల నుంచి ఆమెను పలుకారణాల వల్ల తప్పించిన సంగతి తెలిసిందే. ‘స్పిరిట్’ విషయంలో దీపిక డిమాండ్స్‌పై చిత్రబృందంతో విభేదాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లు ప్రచారం జరిగింది. ఇక ‘కల్కి 2’ నుంచి తప్పుకోవడంపై దీపిక పెద్దగా స్పందించలేదు.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఈ రెండు సినిమాల నుంచి తప్పుకున్న తర్వాత దీపిక ‘రాకా’, ‘కింగ్’ ప్రాజెక్ట్స్‌కు కమిట్ అయింది. ఈ సమయంలో ఆమె రెండోసారి తల్లి కాబోతున్నట్లు అధికారికంగా వెల్లడైంది. అయినప్పటికీ షూటింగ్స్‌కు బ్రేక్ ఇవ్వకుండా తనకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసిందని సమాచారం. ‘రాకా’లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను బాడీ డబుల్ లేకుండా చేసినట్లు కూడా సమాచారం. త్వరలో ‘రాకా’కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. దర్శకుడు అట్లీ పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన చిన్న ట్రీట్ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక ‘కింగ్’ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో దీపిక మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర పరిమితంగానే ఉంటుందని ఇండస్ట్రీలో టాక్.
ఇదిలా ఉంటే.. దీపిక మరో కొత్త ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ కామెడీ డ్రామా ‘ది ఇంటర్న్’కు రీమేక్‌గా తెరకెక్కనున్న సినిమాలో ఆమె నటించనుంది. ఈ ప్రాజెక్ట్‌కు దీపిక దాదాపు ఆరేళ్ల క్రితమే కమిట్ అయింది. అయితే కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అప్పట్లో సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ సినిమా తెరకెక్కితే ‘పీకూ’ తర్వాత మరోసారి అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించే అవకాశం దీపికకు దక్కనుంది. మొత్తంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న దీపిక పాత ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతుంది.
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!