బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో దీపికా పదుకొణె కూడా ఒకరు. అనతి కాలంలోనే బడా హీరోలతో జత కట్టి తన కంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.గత ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో దీపికా పదుకొనే మరో సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే ఇటివల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన దీపికా అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. అయితే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాడీలో చాలా మార్పులు వస్తాయి. లావుగా అవ్వడం ముఖ్య సమస్య. హీరోయిన్‌ల విషయానికి వస్తే కొంత మంది ఫిగర్ మెయింటైన్ చేస్తారు. కొంతమంది అలాగే ఉండిపోతారు. బాలీవుడ్ బ్యూటీ అలియా ని కనుక చూసుకుంటే బిడ్డకు జన్మనిచ్చిన కూడా ఇప్పటికీ అదే ఫిగర్ మెయింటైన్ చేస్తుంది.
Also Read : Prithviraj : రజినీకాంత్‌తో సినిమా జస్ట్ మిస్ : పృథ్వీరాజ్
అయితే తాజాగా సభ్యసాచి 25వ వార్షికోత్సవ షోలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకొణె, సోనమ్ కపూర్, అలియా భట్, అనన్య పాండే, అదితి రావు హైదరి, ఇతర హీరోయిన్స్ ఎంతో అందంగా మెరిశారు. వీరిలో దీపికా గెటప్ విచిత్రంగా ఉంది. పాపకు జన్మనిచ్చిన తర్వాత దీపికా పదుకొణె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తెల్లటి దుస్తుల్లో ఆమె ఓ ర్యాంప్ వాక్ లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె లుక్ చూడగానే అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోయారు. దీపిక ఏంటీ ఇలా బొద్దుగా మారిపోయింది.. నటి రేఖలా కనిపిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రజంట్ ఈ అమ్మడుకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.