యావత్ సినీ ప్రేక్షకులందరు ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ఈ చిత్రం కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కెజిఎఫ్ చాప్టర్ 1 తో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ నీల్ చాఫ్టర్ 2 తో ఆ సెన్సేషన్ ని తిరిగి రాద్దామనుకుంటున్నాడు. ఇప్పటికే చాప్టర్ 2 కి సంబంధించిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు రికార్డులు కూడా సృష్టించాయి. ఇక తాజాగా ప్రేక్షకులందరు ఎదురుచూస్తున్న అప్డేట్ ని మేకర్స్ తెలియజేశారు.
ఇటీవలే ట్రైలర్ కావాలా..? సాంగ్ కావాలా అంటూ అభిమానులనే అడిగిన మేకర్స్ అందరు సాంగ్ కావాలనేసరికి ప్రేక్షకుల కోరిక మేరకు ఈ సినిమాలోని మొదటి సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. తుఫాన్ అంటూ సాగే ఈ పాటను మార్చి 21 న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సరికొత్త పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. బొగ్గు గనుల మధ్య చిన్న పిల్లలను చూపించారు. చాప్టర్ 1 లో వారిని కాపాడేందుకు వచ్చినవాడే రాఖీ భాయ్.. ఇక ఏప్రిల్ 14 న విడుదల కానున్న ఈ సినిమాలో యష్ సరసన శ్రీనిధిశెట్టి నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్, రవీనా టాండన్, ఈశ్వరి రావ్, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.
Get Ready! #Toofan is coming ?
— Hombale Films (@hombalefilms) March 18, 2022
'Toofan' Lyrical Video will be out on March 21st at 11:07 AM.#KGFChapter2 #KGF2onApr14@FarOutAkhtar @ritesh_sid @VaaraahiCC@excelmovies @AAFilmsIndia @DreamWarriorpic@PrithvirajProd @LahariMusic pic.twitter.com/fZZhU71iUF