Dasari Jayanthi: సినీ దిగ్గజాల సమక్షంలో దాసరి ఫిల్మ్ అవార్డ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dasari Film Awards: దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో దాసరి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభ పలువురు సినీ దిగ్గజాల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ, ముత్యాల సుబ్బయ్య, వి.వి. వినాయక్, సి. కల్యాణ్, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, అలీ, టి.ఎఫ్.డి.సి చైర్మన్ అనిల్ కూర్మాచలం, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు, రాజా వన్నెంరెడ్డి, దాసరి అల్లుడు డాక్టర్ రఘునాధ్ బాబు, రచయిత రాజేంద్ర కుమార్ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకలో… ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ, శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, డాక్టర్ బ్రహ్మానందం, ‘బలగం’ నిర్మాత హర్షిత్ రెడ్డి, వంశీ రామరాజు, కళా జనార్దన్, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ గౌరీ శంకర్, దివాకర్, పబ్లిసిటీ డిజైనర్ రాంబాబు, వి.ఎఫ్.ఎక్స్ చందు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ ప్రభు, ధీరజ అప్పాజీ, కవిరత్న చింతల శ్రీనివాస్ తదితరులు దాసరి ప్రతిభా పురస్కారాలు అందుకున్నారు.
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ ఉత్తమ హీరోకి తన వంతుగా యాభై వేల పారితోషికం ఇస్తానని ప్రకటించారు. బ్రహ్మానందం మాట్లాడుతూ దాసరి గారి పేరు మీద జరిగే ప్రతి కార్యక్రమంలో తాను పాల్గొంటానని చెప్పారు. రామ సత్యనారాయణ దర్శకరత్న దాసరి గారి మీద ఉండే అభిమానంతో ప్రతి ఏటా ఈ కార్యక్రమం చేయటం అభినందనీయమని వి.వి. వినాయక్ అభినందించారు. మా తమ్ముడు రామ సత్య నారాయణ దాసరి గారిని గుర్తుంచుకుని ప్రతిభావంతులకి అవార్డ్స్ ఇవ్వటం ఆనందకరమని సి. కళ్యాణ్ చెప్పారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ – వాసవి ఫిల్మ్ అవార్డ్స్ వ్యవస్థాపకులు కొత్త వెంకటేశ్వరరావు, మడిపడిగె రాజు, ముఖ్య సలహాదారులు బండారు సుబ్బారావు, పబ్బతి వెంకట రవి కుమార్ సారథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ వేడుకలో ఆంధ్ర, తెలంగాణలో పలు రంగాల్లో విశేష కృషి చేస్తున్న ప్రతిభావంతులకు కూడా ఈ పురస్కారాలు ప్రదానం చేశారు.
Also Read
- Kiran Abbavaram: 'మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..' ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
- Vallabhaneni Anil: జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వివాదం కాదు.. తప్పు చేస్తే ఫెడరేషన్ శిక్షిస్తుంది!
- Posani Krishna Murali: 'లవ్ యూ రాజా' డైలాగ్ వెనుక అసలు కథ ఇదే.. అసలు విషయం చెప్పిన పోసాని
- Fauji: ప్రభాస్ 'ఫౌజీ' చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
తాజావార్తలు
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
-
UP: ఘజియాబాద్‌లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
-
Kiran Abbavaram: ‘మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..’ ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!