Shine Tom Chacko: మలయాళ నటుడు షైన్ టామ్ చాకో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాలీవుడ్ లో మంచి మంచి సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న చాకో.. దసరా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో నానికి ధీటుగా చాకో చూపిన నటన అద్భుతమనే చెప్పాలి. ఈ సినిమా తరువాత చాకో.. ఇంటర్వ్యూలు నెట్టింట వైరల్ అయిన విషయం కూడా తెల్సిందే. ప్రస్తుతం చాకో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఇకపోతే చాకో 40 ఏళ్ళ వయస్సులో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చాడు. గత కొంత కాలంగా అతను మోడల్ తనూజ అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఏ ఫంక్షన్ కు వచ్చినా ఆమెతో కలిసి వస్తున్నాడు. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి.
ఇక ఎట్టకేలకు ఆ వార్తలను నిజం చేస్తూ తనూజ తో తనకు ఎంగేజ్ మెంట్ జరిగినట్లు చాకో అధికారికంగా ప్రకటించాడు. సోషల్ మీడియాలో నిశ్చితార్థం జరిగిన ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట గా వైరల్ గా మారాయి.ఇక చాకోకు ఆల్రెడీ తబితా అనే అమ్మాయితో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. వీరికి ఒక పాప కూడా ఉందని వికీపీడియా చెప్తుంది. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగింది.. విడిపోయారా.. ? లేక కలిసే ఉన్నారా.. ? అనేది మిస్టరీగా ఉంది. వచ్చే నెల వీరి పెళ్లి జరగనుందని తెలుస్తోంది. ఏదిఏమైనా చాకోకు మాత్రం ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.