Ahimsa దగ్గుబాటి వారసుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ. యంగ్ డైరెక్టర్ తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి “అహింస” అని పేరు పెట్టారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతుండగా, దగ్గుబాటి వారసుడు సెట్స్ కు రాకుండా డైరెక్టర్ ను ముప్పుతిప్పలు పెడుతున్నాడని టాక్ నడుస్తోంది. అభిరామ్ సిల్లీ రీజన్స్ తో షూటింగ్ కు డుమ్మా కొడుతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఇటీవల కాలు నొప్పి అని చెప్పి షూటింగ్ కు డుమ్మా కొట్టిన అభిరామ్, అదే సమయంలో స్నేహితులతో పాటు పార్టీ చేసుకున్నాడట. అతను ఎదో ఒక విధంగా షూటింగ్ కు రాకుండా టైం వేస్ట్ చేస్తుండడంతో విషయాన్ని సురేష్ బాబు వద్దకు తీసుకెళ్లి అభిరామ్‌ని ట్రాక్‌లోకి తీసుకురావాలని తేజ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read Also : KGF Chapter 2 : అతనికి అడ్డు నిలబడకండి… “తూఫాన్” వచ్చేసింది !
వాస్తవానికి చాలా కాలంగా అభిరామ్ ఎంట్రీ గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టార్ వారసుడే కాబట్టి ఇండస్ట్రీలోకి ఎంట్రీ సులభమే. కానీ ఇక్కడ ట్యాలెంట్ ను నిరూపించుకోలేకపోతే స్టార్ కిడ్ ట్యాగ్ కూడా పక్కన పెట్టేయాల్సి వస్తుంది. ఎట్టకేలకు తేజ దర్శకుడిగా సురేష్ బాబు ఈ ప్రాజెక్ట్ ను సెట్ చేయగా, ఇప్పుడు అభిరామ్ దర్శకుడిని చాలా ఇబ్బంది పెడుతున్నాడని వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే గనుక నెక్స్ట్ మూవీకి అభిరామ్ తో కలిసి పని చేయడానికి దర్శకులు వెనకడుగు వేసే ప్రమాదం ఉంది. మరి అభిరామ్ తో తేజ ఇలాంటి రూమర్ల మధ్య ఈ సినిమాను ఎలా పూర్తి చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అభిరామ్‌తో సినిమా తీయాలని సురేష్ బాబుతో మరికొద్ది మంది దర్శకులు కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.