గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘డాకు మహారాజ్’ షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ కు రెడీ గా ఉంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. షూటింగ్ ముగించుకున్న డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాడు. జనవరి 4న డల్లాస్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసారు మేకర్స్.
Also Read : Rewind 2024 Mollywood : కలెక్షన్సే కాదు.. ప్రశంసలు సైతం దక్కించుకున్న మాలీవుడ్
ఇక తాజగా ఈ ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ ను ఓపెన్ చేసారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసారు డిస్ట్రిబ్యూటర్ శ్లోక ఎంటర్టైన్మెంట్స్. డాకు మహారాజ్ తో ఓవర్సీస్ లో బాలయ్య గత చిత్రాల తాలూకు రికార్డులు బద్దలు కావడం ఖాయం అని ఫ్యాన్స్ నుండి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాను USA లో శ్లోక ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తుండగా ఓవర్సీస్ లో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తోంది. డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ను ఆ ఈవెంట్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశాడట నిర్మాత నాగవంశీ. డల్లాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారట ఫ్యాన్స్. బాలయ్య రాక సందర్భంగా ర్యాలీ నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న డాకు మహారాజ్ ను సితార ఎంటెర్టైమెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.