Anil Sunkara: అనిల్ సుంకరపై క్రిమినల్ కేసు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Criminal Case filed on anil sunkara and ram brahmam sunkara: ‘భోళా శంకర్” సినిమా నిర్మాతలపై హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు చీటింగ్ తో పాటు వివిధ కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అఖిల్ హీరోగా నటించిన ‘ఏజెంట్” సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో తనను మోసం చేశారని ఆ సినిమాకు సంబంధించి బ్యాంకు ద్వారా తాను అమౌంట్ చెల్లించినా తనకు కేవలం విశాఖపట్నం వరకే తనకు హక్కులను ఇచ్చారని శనివారం బత్తుల సత్యనారాయణ (సతీష్) వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాను వెళ్లి నిర్మాతలను సంప్రదించగా, ‘భోళా శంకర్” సినిమా విడుదలకు ముందు తన డబ్బులు తిరిగి చెల్లిస్తామని అండర్ స్టాండింగ్ లెటర్ ఇచ్చారని ఆ తరువాత మాట తప్పారని అన్నారు. తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదని, తన డబ్బుల రికవరీ కోసం కోర్టును ఆశ్రయించడం జరిగిందని అన్నారు.. నేను చెల్లించిన 30 కోట్ల రూపాయల డబ్బును రికవరీ చేసుకునేందుకు సూట్ ఫైల్ చేసుకోమని హైదరాబాద్ సివిల్ కోర్టు అనుమతినిచ్చిందని, ఆ మేరకు న్యాయ పోరాటం చేస్తున్నామని సతీష్ అన్నారు.
Game Changer: గేమ్ ఛేంజర్ లీక్స్.. కేసు పెట్టిన దిల్ రాజు సంస్థ
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
ఇక మరోవైపు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సదరు నిర్మాతలపై వివిధ సెక్షన్స్ కింద క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయ్యాయని ఆయన చెప్పారు. ఇక అడ్వొకేట్ కేశాపురం సుధాకర్ మాట్లాడుతూ, బత్తుల సత్యనారాయణ (సతీష్) ను మోసం చేసిన వారిపై న్యాయస్థానంలో సివిల్ కేసులకు సంబందించిన వాదనలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. న్యాయం సతీష్ పక్షాన ఉన్నందున తాము తప్పకుండా గెలుస్తామని, ఆ మేరకు సదరు నిర్మాతలపై రికవరీ సూట్ ఫైల్ చేసుకోమని కోర్టు చెప్పిందని ఆయన అన్నారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో సతీష్ ను మోసం చేసిన భోళా శంకర్ నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర వారి సంస్థకు చెందిన గరికపాటి కిషోర్ పై కుట్ర, చీటింగ్, నమ్మకద్రోహం,వంటి వివిధ సెక్షన్స్ కింద కేసులు రిజిస్టర్ అయ్యాయని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Women’s Health: మాంసం తినే మహిళలు వందేళ్లు బతుకుతారా?
-
Ultra-Processed Foods: మీరు తినే ఈ ఫుడ్‌తో బ్రెయిన్ డ్యామేజ్!
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు పండగే, ఊహించని డబ్బు!
-
Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
-
IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!