తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం మూవీ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో ఉపేంద్ర, అక్కినేని నాగార్జున తో పాటు బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. శృతిహాసన్ ఫిమేల్ లీడ్‌లో కనిపించనున్నారు. ఇంకా సత్యరాజ్ కీలక పాత్ర పోషించగా, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనున్నారట. 2025 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుగు రాతోతున్న ఈ మూవీ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది..
ఎంటీ అంటే అందాల భామ శ్రుతి హాసన్ ఈ సినిమా కోసం డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఓ ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫోటోను అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు, సింగర్‌గా కూడా ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా నేషనల్ స్థాయిని దాటి ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమాలు చేస్తూ అభిమానులకు షాక్ ఇస్తుంది శృతిహాసన్ .