ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం ఈరోజు పలు భాషల్లో భారీగా విడుదలైంది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలతోనే ఈ చిత్రం పాజిటివ్ బజ్ ను అందుకోవడం సాలిడ్ ఆక్యుపెన్సీకి తెర తీసింది. సినిమాకు మొదటి రోజు వసూళ్లు భారీగా రానున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాను కర్ణాటకలో కూడా తెలుగులో విడుదల చేయడం పట్ల ఇప్పటికే కన్నడిగులు ఆగ్రహానికి గురయ్యారు. మరోమారు ‘పుష్ప’ వర్సెస్ ‘కేజిఎఫ్’ అంటూ రెండు సినిమాలను పోలుస్తూ ట్రెండ్ చేస్తున్నారు. దీనికి కారణం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అతిథి ఒకరు మాట్లాడుతూ ‘పుష్ప’… ‘కేజీఎఫ్’ లాంటి సినిమా కంటే పది రెట్లు భారీ రేంజ్ లో ఉంటుందని అన్నారు. ఇప్పుడు ఇదే ప్రకటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Read Also : థియేటర్లో ‘పుష్ప’రాజ్ ఫ్యాన్స్ రచ్చ… అద్దాలు, కుర్చీలు ధ్వంసం
దీంతో సినిమా చూసిన వారిలో కొందరు ప్రేక్షకులతో పాటు యష్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ ‘కేజీఎఫ్’కి ‘పుష్ప’ ఎక్కడా చేరువలో లేదని సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ఘాటైన వ్యాఖ్యలతో ‘పుష్ప’ సినిమాను ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ‘కేజిఎఫ్’ కంటే ‘పుష్ప’ బెటర్ అని, అల్లు అర్జున్‌ని మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా చూపించిందని, బన్నీ కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని, సినిమా భారీ హిట్ అవుతుందని ‘పుష్ప’రాజ్ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఏం మాట్లాడినా, ఏం చేసినా మొత్తానికి ‘పుష్ప’కు ‘కేజీఎఫ్’తో ఈ పోలిక హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే ‘పుష్ప’ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైన విషయం తెలిసిందే.
