Comedian Saptagiri at TDP Janasena meeting Video Goes Viral: సినీ పరిశ్రమలో దర్శకుడిగా ఎదగాలని ఎంట్రీ ఇచ్చిన సప్తగిరి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ప్రారంభించారు. అయితే దర్శకుడిగా అవకాశం రాలేదు కానీ చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ఇప్పుడు ఏకంగా స్టార్ కమెడియన్ రేంజ్ కి దిగారు. ఒకపక్క కమెడియన్ గా సినిమాలు చేస్తూనే మరొక పక్క హీరోగా కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఇక ఆయన పాలిటిక్స్ లోకి రాబోతున్నారు అని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆయన గత ఏడాది జూన్ సమయంలో తాను పొలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. టిడిపిలో చేరతానని గతంలో ఆయన తిరుపతి పర్యటనలో వెల్లడించారు. టిడిపి నుంచి తనకు ఆఫర్ ఉందని, ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. తనకు నారా లోకేష్ ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది ఆయనే నిర్ణయిస్తారని తాను చంద్రబాబు చేసిన అభివృద్ధిని చూస్తూ పెరిగిన వ్యక్తిని అప్పట్లో చెప్పుకొచ్చారు.
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం – రహస్య గోరఖ్ ఎంగేజ్ మెంట్ ఫొటోస్ చూశారా ..?
అయితే ఆ తర్వాత సప్తగిరి సైలెంట్ అయిపోయారు. అప్పుడే టికెట్లు గట్రా ఇవ్వడం కుదరదని చెప్పారో లేక ఈ సారికి ప్రచారం చేయమని చెప్పారో తెలియదు కానీ అప్పటి నుంచి ఆయన సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే తాజాగా ఆయన తెలుగుదేశం జనసేన ఉమ్మడి మీటింగ్లో మెరిశారు. మెడలో తెలుగుదేశం పార్టీ కండువాతో పాటు జనసేన కండువా కూడా వేసుకుని ప్రసంగిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిత్తూరు జిల్లాకు చెందిన సప్తగిరి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. ఆయన తండ్రి చిత్తూరు జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గార్డుగా పనిచేసేవారు. అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్ అయినా సరే తిరుమలలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఆయన తన పేరుని సప్తగిరిగా మార్చుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఆయన కేవలం ప్రచారానికే పరిమితం అవుతారా లేక ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తారా అనేది చూడాలి.
తాజా రాజకీయాల్లో కీ సినిమా నటుడు సప్తగిరి.. తెలుగుదేశం జనసేన సభలో పాల్గొన్న సప్తగిరి.#ChandrababuNaidu #Pawankalyan#Naralokesh #TDPTwitter #TDPJanasena pic.twitter.com/xQ8lDD2ivy
— 🦁 (@TEAM_CBN1) March 14, 2024