Dhanraj: డైరెక్టర్ అవుతున్న మరో జబర్దస్త్ కమెడియన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Comedian Dhanraj to turn director Soon: ఇటీవల, జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి బలగం సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మెగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తరువాత జబర్దస్త్ కమెడియన్ శాంతికుమార్ కూడా డైరెక్టర్ గా మారి ఒక సినిమా డైరెక్ట్ చేశాడు కానీ డి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు మరో తెలుగు కమెడియన్ దర్శకుడిగా మారేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన ఇంకెవరో కాదు కమెడియన్ ధనరాజ్. ధనరాజ్ ఒకప్పుడు టాలీవుడ్‌లో చాలా మంచి యంగ్ కామెడియన్. ఇప్పటికే హీరోగా కూడా ఒకటి రెండు సినిమాలు చేశాడు కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు తెలుగులో దర్శకుడిగా మారేందుకు సిద్ధం అవుతున్నాడు. సముద్రకని ప్రధాన పాత్రలో నటించే తెలుగు సినిమాతో ధనరాజ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడని అంటున్నారు. ధనరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ZEE5 సంస్థ నిర్మించనుందని అంటున్నారు.
Shah Rukh Khan: షారుఖ్ కి వై ప్లస్ భద్రత ఎలా ఉంటుందో తెలుసా?
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. నటీనటులు -సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా వెల్లడి కానున్నాయి అని అంటున్నారు. ధన్ రాజ్ ప్రస్తుతం జబర్దస్త్ లో లేదు. మరో పక్క సినిమాల్లోనూ కమెడియన్ గా ధనరాజ్ కి అవకాశాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో దర్శకుడిగా మారుతున్నాడని అంటున్నారు. ఈమధ్య విమానం అనే సినిమా షూటింగులో నటుడు సముద్రఖనికి ధన్ రాజ్ కథ వినిపించగా ఆ కథ సముద్రఖనికి బాగా నచ్చిందని ఈ క్రమంలో వెంటనే సినిమాలో నటించేందుకు సముద్రఖని ఒప్పుకున్నారని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ దసరా తర్వాత మొదలు కాబోతుందని, దసరా రోజున లాంచనంగా షూటింగ్ మొదలుకానుందని అంటున్నారు. తెలుగు, తమిళం భాషల్లో ఈ చిత్రం విడుదల అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కూడా పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది కానీ కోస్తా ఆంధ్ర నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. సముద్రఖని కాకుండా మిగతా నటీనటులు అందరూ కొత్తవారని అంటున్నారు. దసరాకి అధికారికంగా లాంచ్ కానున్న ఈ సినిమా 2024లో థియేటర్లలోకి రానుంది.
తాజావార్తలు
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!