CM Pellam : ఈ నడుమ మంచి కంటెంట్ తో వస్తున్న చిన్న సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి కోవలోనే తాము కూడా వస్తున్నామని అంటున్నారు “సీఎం పెళ్లాం” మూవీ టీమ్. ఇంద్రజ, అజయ్ , జయసుధ , సుమన్ మెయిన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాను గడ్డం రమణా డైరెక్ట్ చేస్తుండగా బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషనల్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్ గురించి చేసిన ఈ పాట అందరికీ నచ్చతుందంటూ తెలిపారు.
Read Also : KTR : కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో అపశృతి..
యాక్టర్ అజయ్ మాట్లాడుతూ ఈ సినిమాలో తాను సీఎం పాత్రలో చేశానని.. తన భార్య పాత్రలో ఇంద్రజ నటనకు అంతా ఫిదా అవుతారని తెలిపారు. తాను ఒక సీఎం పాత్రలో నటించడం ఇదే మొదటిసారి అని.. సినిమాను తాము చేసిన ఇంటెన్షన్ వేరే అని థియేటర్ లో చూస్తే మీకే అర్థం అవుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. డైరెక్టర్ రమణా మాట్లాడుతూ.. ఈ సినిమాతో అజయ్ కు మంచి పేరు, ప్రఖ్యాతలు వస్తాయన్నారు. ఇంద్రజ మాట్లాడుతూ ఈ సినిమా కచ్చితంగా కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పింది. సీఎం పెళ్లాం పాత్ర తనకు ప్రత్యేకంగా గుర్తింపు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇలాంటి సినిమాలు ఈ జనరేషన్ లో చాలా అసవరం అని త్వరలోనే థియేటర్లలో కలుద్దామంటూ తెలిపింది.