University: పీపుల్ స్టార్ మూవీకి క్లీన్ యు సర్టిఫికెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R. Narayanamurthy: పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన సినిమా ‘యూనివర్సిటీ’. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను ఇటీవల పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమైంది. దీని గురించి ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ, ”మా ‘యూనివర్సిటీ’ చిత్రం సెన్సార్ పూర్తి అయింది. అతి త్వరలో ఆడియో రిలీజ్ చేసి త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ప్రస్తుత విద్యావ్యవస్థకు సంబంధించిన చిత్రమిది. యూనివర్సిటీ చదువులు పూర్తిచేసుకుని కెరీర్ పై బోలెడన్ని ఆశలు పెట్టుకుని వస్తున్న యువతను ఇప్పుడున్న పరిస్థితులు చాలా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎంతో కష్టపడి పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే… లీకేజీలు కాటు వేస్తున్నాయి. ఇటీవలే 10వ తరగతిలో పేపరు లీకేజీలు, గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరు లీకేజీ సంఘటనలు మనం చూశాం. ఇలా జరిగితే… విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి ? క్లాస్ రూమ్ లో విద్యార్థులకు లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు చేస్తూ ఉంటే, రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కొట్టుకుంటూ ఊపిరి ఆడిక గింజుకుంటున్నాయి. ఈ విద్యావ్యవస్థ, ఈ ఉద్యోగ వ్యవస్థ ఇలాగే నిర్వీర్యం కావాలా? కాకూడదు. మనది నిరుద్యోగ భారతం కాదు. ఉద్యోగ భారతం కావాలి. ఈ అంశాలను ఈ చిత్రంలో చూపించాం” అని అన్నారు. ఆర్. నారాయణమూర్తితో పాటు నూతన నటీనటులు ఈ చిత్రంలో కీలకమైన పాత్రలను పోషించారు. ఈ సినిమాలోని పాటలను గద్దర్, నిస్సార్, మోటపలుకులు రమేశ్, వేల్పుల నారాయణ రాయగా, గద్దర్, సాయిచరణ్, గోస్కుల రమేశ్, పల్లె నరసింహం గానం చేశారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి.
Also Read
- SriGouriPriya: 'మిస్ హైదరాబాద్' నుంచి హీరోయిన్ వరకు.. తన జర్నీ గురించి చెప్పిన చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్!
- Naga Chaitanya : కిరణ్ కు ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని బాధపడ్డాను
- SriGouriPriya: 'నాకు కోపం వచ్చినా.. బాధైనా మావోడు బయటకు వస్తాడు'.. శ్రీ గౌరీ ప్రియ షాకింగ్ కామెంట్స్!
- Allu Arjun: హేటర్స్‌కు అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్.. ఏం చెప్పాడు భయ్యా!
తాజావార్తలు
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
New Act: పార్లమెంట్లో కీలక చట్టం.. సైబర్ నేరాలకు మరణశిక్ష..
-
Narendra Modi: ఇది కదా మోడీ క్రేజ్.. Gen Z వీడియోలతో 10.5 కోట్లు దాటిన ఫాలోవర్స్..
-
SriGouriPriya: ‘మిస్ హైదరాబాద్’ నుంచి హీరోయిన్ వరకు.. తన జర్నీ గురించి చెప్పిన చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్!
-
Naga Chaitanya : కిరణ్ కు ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని బాధపడ్డాను
ట్రెండింగ్
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?