Star Heroine: సాధారణంగా ఒక సినిమా చేస్తున్న సమయంలో డైరెక్టర్ కు, చిత్ర బృందానికి కొన్ని గొడవలు రావడం సహజం. ఆ గొడవలు ముదిరినప్పుడు ఆ సినిమా నుంచి తప్పుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. ఇక అంతంత డబ్బుపోసి సినిమాను నిర్మించే నిర్మాత.. ఇలాంటి గొడవలను సర్దుబాటు చేసి.. మళ్లీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడు. ఇక ఇదే ఘటన టాలీవుడ్ లో మరోసారి రిపీట్ అయ్యిందని తెలుస్తోంది. ఒక స్టార్ డైరెక్టర్.. ఒక స్టార్ హీరోయిన్ ను కావాలనే విసిగించడంతో.. చూసి చూసి విసిగిపోయిన ఆమె.. డైరెక్టర్ తీరును తట్టుకోలేక సినిమా నుంచి తప్పుకోవాలని చూసిందంట. అయితే మధ్యలో నిర్మాత కలుగజేసుకొని.. దండం పెట్టి.. సినిమాను ఫినిష్ చేయమని అడగడంతో ఆమె ఒప్పుకొని సినిమాను పూర్తిచేస్తుందని టాక్ నడుస్తోంది. మొదటి సినిమాతోనే అందరికి దగ్గరైన హీరోయిన్.. రెండో సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమా ఆమెకు మూడో సినిమా. ఇక హీరో కూడా పెద్ద స్టారే. డైరెక్టర్, నిర్మాత, హీరో కాంబోలో ఇప్పటికే ఒక హిట్ సినిమా కూడా వచ్చింది. దీంతో ఈ చిత్రంపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ కూడా బాగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి.
ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్ లో.. సదురు హీరోయిన్ ను కెమెరా ముందే కూర్చోవాలని డైరెక్టర్ పట్టుబడుతున్నాడట.. బ్రేక్ ఇవ్వకుండా.. సీన్ చెప్పకుండా.. కెమెరా ముందే కూర్చోవాలని హుకుం జారీ చేస్తున్నాడట. డైరెక్టర్ తీరు నచ్చని హీరోయిన్.. రెండు మూడు సార్లు తనకు ఇబ్బందిగా ఉంది అని చెప్పినా కూడా సదురు డైరెక్టర్ వినకపోవడంతో.. ఆమె సినిమా నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యిందట. ఇక ఈ గొడవ కాస్తా నిర్మాత దగ్గరకు వెళ్లడం, ఆయన సినిమా మధ్యలో ఆగిపోతే కష్టమని.. దండం పెట్టి సినిమాను పూర్తి చేయమని అడగడంతో ఆయనపై ఉన్న గౌరవంతో ఆమె ఈ సినిమా పూర్తి చేసిందని టాక్. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, సదురు డైరెక్టర్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా ఈ డైరెక్టర్ ఎన్నో వివాదాలను ఫేస్ చేశాడు. మరి ఈ స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.