Andhra Pradhesh : ఏపీలో సినిమా థియేటర్స్ క్లోజ్.. కారణం ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ తీర ప్రాంతాలను మొంథా తుపాను వణికిస్తోంది.. కాకినాడ, విశాఖ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. మొంథా తీవ్ర తుఫాన్‌గా బలపడడంతో ఏపీలోని కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తుఫాన్ ప్రభావంతో గరిష్టంగా 100-110 కిలో మీటర్లకు ఈదురుగాలుల వీస్తున్నాయి.. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో 72 గంటల పాటు తుఫాన్ ముప్పు ఉంది. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. ప్రజలు ఎవరు బయటకు రావద్దని ప్రభుత్వం పలు సూచనలు చేస్తోంది.
మొంథా తుపాను ప్రభావంతో స్కూల్స్, కాలేజీలు, కార్యాలయాలకు హాలిడే ప్రకటించారు. ఈ తుఫాను ప్రభావం కారణంగా ఏపీలోని థియేటర్స్ ను మూసివేయాలని నిర్ణయించారు. వాతావరణం అనుకూలంగా లేదు, ప్రజలు ఎవరు బయటకు రావద్దు, సినిమా ప్రదర్శనలను తుఫాను తగ్గేవరకు మూసివేస్తున్నామని ప్రకటించాయి థియేటర్స్ యాజమాన్యాలు. కాకినాడ, విశాఖపట్నం వంటి ఏరియాలలో తీవ్ర వర్షం కారణంగా థియేటర్స్ లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో థియేటర్స్ మూసివేసేందుకు నిర్ణయించారు. అయితే తెలంగాణాలో మాత్రం మొంథా తఫాను ప్రభావం అంతగా లేదు. చెదురు మొదురు వర్షాలు తప్ప తీవ్ర వర్షాలు అయితే లేవు. తెలంగాణలో సినిమా ప్రదర్శనలకు ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడి థియేటర్స్ లో యథాతదంగా రన్ అవుతున్నాయి. ఏపీలో తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గేంతవరకు ముఖ్య జిల్లాలలో ప్రదర్శనలు నిలిపివేయనున్నారు.
Also Read
- Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. 'రామాయణ' రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
- Ranabaali Review: రణబాలి రివ్యూ..
తాజావార్తలు
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!