జీ తెలుగు ఈ వారాంతంలో మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమైంది. చిన్న పిల్లల్లోని టాలెంట్‌ని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు చూపే సక్సెస్‌ఫుల్ రియాలిటీ షో డ్రామా జూనియర్స్ సీజన్ 8 తుది అంకానికి చేరుకుంది. డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే రెండు భాగాలుగా ప్రసారం కానుంది. అంతేకాదు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాను ఈ ఆదివారం ప్రసారం చేయనుంది.
Athadu : ‘అతడు’ తీయడానికి ఎంత కష్టపడ్డారో, ఒక్క షాట్‌కి అంత కష్టపడ్డారు!
డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే పార్ట్ 1 ఆగస్టు 9 శనివారం రాత్రి 9 గంటలకు, ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ ఆదివారం సాయంత్రం 6 గంటలకు, జీ తెలుగులో ప్రసారం కానుంది. జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథులుగా హీరో తేజ సజ్జా, యాంకర్ ఉదయభాను, నటుడు సత్యరాజ్, మెగా డాటర్ కొణిదెల సుస్మిత వంటి సినీ ప్రముఖులు సందడి చేయనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆగస్టు 09న మొదటి భాగం, ఆగస్టు 16న రాత్రి 9 గంటలకు రెండవ భాగం ప్రసారం కానుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన ‘నీలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం (NEEK)’ తెలుగు వెర్షన్ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాను జీ తెలుగు ప్రీమియర్‌గా అందిస్తోంది.