Toxic: యష్ ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెజిఎఫ్ (KGF) సిరీస్‌తో పాన్-ఇండియా రేంజ్లో సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ (Yash) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ కమర్షియల్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ (TOXIC). మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సినిమా విడుదల విషయంలో మాత్రం వరుస బ్రేకులు పడుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు డేట్లు మార్చుకున్న ఈ చిత్రం.. తాజాగా జూన్ 4 రిలీజ్ డేట్‌ను కూడా వదిలేసుకుని వాయిదా పడింది. బెంగళూరు ఫిల్మ్ నగర్ వర్గాల ప్రకారం.. ఈ సినిమా వాయిదా పడటం వెనుక బలమైన బిజినెస్ రీజన్స్ (Introduction) ఉన్నట్లు తెలుస్తోంది.
‘టాక్సిక్’ చిత్ర డిజిటల్ రైట్స్ (OTT Rights) కోసం నిర్మాతలు ఆశిస్తున్న రేటుకు, ప్రముఖ ఓటీటీ సంస్థలు కోట్ చేస్తున్న అమౌంట్‌కు అస్సలు సింక్ కుదరడం లేదు. మేకర్స్ అడుగుతున్న బడ్జెట్లో ఓటీటీ కంపెనీలు కేవలం 30 నుండి 40 శాతమే ఆఫర్ చేస్తున్నాయట. ఈ డిజిటల్ బిజినెస్ డీల్స్ ఇంకా తెగకపోవడంతోనే రిలీజ్ డేట్‌ను వెనక్కి నెడుతూ వస్తున్నారు. నిజానికి జూన్ రిలీజ్ పక్కా అనుకుని హీరో యష్ ఏప్రిల్‌లోనే నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. కానీ, అనుకోని బిజినెస్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు పబ్లిసిటీని పూర్తిగా పక్కనబెట్టి, డైరెక్టర్‌తో కలిసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యాడు. అంటే ఆగస్టు నాటికైనా ‘టాక్సిక్’ రాకపోతే.. ఈ ప్రాజెక్ట్ ఏకంగా వచ్చే ఏడాదికి (2027) షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉంది.
Also Read
- Yellamma: ‘ఎల్లమ్మ’ వెనుక అసలు కథ ఇదే.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన దేవిశ్రీ ప్రసాద్!
- బండోడి ట్యూన్‌కి బక్కోడి పాట.. Itlu Arjuna First Single ప్రోమో అదిరింది!
- Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ.. పర్సంటేజ్ గొడవకు ముగింపు పలికినట్లేనా?
- Jagapathi Babu: ‘పెద్ది’ లో ‘పెద్దాయన’ పని అయిపోయింది.. డబ్బింగ్ కంప్లీట్ చేసిన అప్పలసూరి!
ఈ సినిమాను నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) సంస్థకు ఇటీవల విడుదలైన ‘కేడీ’ (KD) సినిమా తీవ్ర నిరాశపరిచింది. అలాగే ‘టాక్సిక్’ గ్లింప్స్, టీజర్లు కూడా ప్రేక్షకుల్లో ఆశించిన స్థాయిలో హైప్ తీసుకురాలేకపోయాయి. అందువల్ల, ఇప్పుడు యష్ ఫ్యాన్స్‌ను మరియు ట్రేడ్ వర్గాలను శాటిస్ఫై చేయాలంటే ఒక మైండ్ బ్లోయింగ్ ట్రైలర్ కట్ చేసి అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాజావార్తలు
-
Toxic: యష్ ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ మళ్లీ వాయిదా..?
-
Yellamma: ‘ఎల్లమ్మ’ వెనుక అసలు కథ ఇదే.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన దేవిశ్రీ ప్రసాద్!
-
Rajat Patidar: డేవిడ్ వార్నర్ రికార్డ్ ను సమం చేసిన ఆర్సీబీ కెప్టెన్.!
-
Mega DSC 2025: మెగా డీఎస్సీ-2025పై దుష్ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు.. పాఠశాల విద్యాశాఖ తీవ్ర హెచ్చరిక
-
Rajat Patidar: గుజరాత్‌ను బాడీ లాంగ్వేజ్‌తోనే బయపెట్టాం.. ఆర్సీబీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!