Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic Makers: రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఆగస్టు 25 నాటికి భారత్‌లో 9 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ప్రీసేల్ బుకింగ్స్‌లో ‘టాక్సిక్’ దూకుడు చూపించిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని ట్రేడ్ నివేదికల ప్రకారం.. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ‘ధురంధర్ 2’ కంటే మెరుగ్గా నమోదయ్యాయని వెల్లడించింది. ‘ధురంధర్ 2’ ప్రీసేల్‌లో 14 లక్షల టికెట్స్ అమ్ముడు కాగా.. ‘టాక్సిక్’ 16 లక్షలు సేల్ అయ్యాయి. భారీ స్థాయిలో టికెట్లు అమ్ముడవడంతో తొలి రోజు వసూళ్లు కూడా అదిరిపోయే స్థాయిలో ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
‘టాక్సిక్’కు విడుదలకు ముందే భారీ స్పందన రావడంతో తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే భారీ వసూళ్లు నమోదవడంతో యశ్ కెరీర్లో మరో బిగ్ ఓపెనింగ్ ఖాయమనే చర్చ మొదలైంది. మరోవైపు ‘టాక్సిక్’ టీమ్ అభిమానులకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు సన్నివేశాలను మొబైల్లో రికార్డ్ చేయవద్దని, సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయొద్దని కోరింది. కథలోని కీలక ట్విస్టులు, స్పాయిలర్లను బయటకు చెప్పకుండా ప్రేక్షకుల అనుభూతిని కాపాడాలని సూచించింది.
Also Read
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
- King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
- Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
తాజావార్తలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
-
Mark Zuckerberg: జుకర్‌బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
-
US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
-
Temple Incident : అమ్మవారి గుడిలో అర్చకుడి దారుణం.. బయట తాళం.. లోపల వికృత చేష్టలు
-
IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..