Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్

Yash

Yash

Yash: “రావణుడి పాత్రను ఎవరైనా చేసేయొచ్చు.. కానీ రాముడి పాత్రను చేయడం అంత ఈజీ కాదు” అంటూ కన్నడ స్టార్ యశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ సుమ చిత్ర బృందంతో మాట్లాడుతున్న సమయంలో యశ్, రణబీర్ కపూర్, సాయి పల్లవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమాపై మరింత హైప్‌ను పెంచేశాయి. ఈ సందర్భంగా యశ్ మాట్లాడుతూ.. “శ్రీరాముడి పాత్రలో ఉండే సింప్లిసిటీని, ఆ క్యారెక్టర్‌లోని కంట్రోల్‌ను స్క్రీన్ మీద చూపించడం చాలా కష్టం. రావణుడి రోల్ ఎవరైనా చేసేయొచ్చు.. కానీ రాముడిగా నటించడం అందరికీ సాధ్యం కాదు” అంటూ రణబీర్ కపూర్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు.

అలాగే రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. “నేను కేజీఎఫ్ చూశాను. యశ్ కేవలం సూపర్ స్టార్ మాత్రమే కాదు. అతనికి స్క్రిప్ట్ రాయడం తెలుసు, సినిమా ఎలా తీయాలో తెలుసు. సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా రన్ చేస్తున్నాడు” అంటూ యశ్ టాలెంట్‌ను మెచ్చుకున్నారు. ఈ వేదికపై సాయి పల్లవి హిందీలో రాముడి భజన పాట పాడి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. “సీత పాత్ర చేయడం నా అదృష్టం. ఈ క్యారెక్టర్ చేయడం వల్ల ప్రశాంతంగా ఉండటం, ఆధ్యాత్మిక భావనతో జీవించడం నేర్చుకున్నాను” అని చెప్పుకొచ్చారు.