ఫ్యాషన్ డిజైనర్ నుండి హీరోయిన్‌గా మారిన కోలీవుడ్ నయా సోయగం దుషారా విజయన్. బోది యారి బుద్ది మారి సినిమాతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన దుషారాకు ఐడెంటిటీని ఇచ్చిన మూవీ సార్పట్ట. ఇది ఓటీటీలో రిలీజ్ కావడంతో బ్యూటీకి రావాల్సినంత హైప్ రాలేదు. ఆ తర్వాత అన్బుల్ల ఘిల్లి, నక్షత్రం నగర్గిరాదు, అర్జున్ దాస్‌తో అనితీ సినిమాలు చేసింది. కానీ దుషారా పేరు గట్టిగా వినబడేలా చేసింది రాయన్.
Also Read : Taraka Rama : ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త ప్రయోగం “పూర్ణ చందర్ రావు”
ధనుష్ హీరో కమ్ దర్శకుడిగా తెరకెక్కించిన మూవీ రాయన్. గత ఏడాది రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో దుషారా ధనుష్ చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఆమె ప్రధాన బలం. ధనుష్ 50th మూవీగా వందకోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 160 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే రజనీకాంత్ వెట్టయాన్‌లో కూడా కీ రోల్ ప్లే చేసింది. ఈ మూవీ ఓకే అనిపించుకుంది. రజనీ, ధనుష్ సినిమాల్లో నటించిన ఈ చెన్నై చిన్నది.. ఇప్పుడు మరో స్టార్ హీరో విక్రమ్ సరసన వీర ధీర శూరన్ 2లో యాక్ట్ చేసింది. చియాన్ భార్యగా కనిపించబోతుంది అమ్మడు. రీసెంట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఆమె నటనను విపరీతంగా పొగిడాడు చియాన్. కెకె తర్వాత విక్రమ్ ఖాతాలో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ లేదు. భారీ కాస్టింగ్‌తో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సిరీస్ చిత్రాల హిట్ సౌండ్ మణిరత్నం ఖాతాలో పడ్డాయి. ధ్రువ నక్షత్రం ఎప్పుడోస్తుందో క్లారిటీ లేదు. సో అర్జెంట్‌గా విక్రమ్‌కు సోలో హిట్ అవసరం. మరీ దుషారా విక్రమ్‌కు లేడీ లక్కుగా మారుతుందో లేదో మార్చి 27 రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి.