BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాలీవుడ్ హీరో నివిన్ పౌలీ రీసెంట్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ బెత్లెహం కుడుంబ యూనిట్.. టాలీవుడ్లో రిలీజ్ కాబోతుంది. 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 4న తెలుగు రాష్ట్రాల్లో విడుదలౌతుంది. ప్రేమలు ఫేం గిరిష్ ఏడీ దర్శకుడు. ప్రేమలులో మెయిన్ కాస్ట్ ఇక్కడ రిపీట్ చేశాడు దర్శకుడు. హీరో మినహాయిస్తే, హీరోయిన్ మమితా బైజు, సంగీత్ ప్రతాప్, శ్యామ్ మెహన్ ఇందులో కూడా నటించారు.
మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద బ్లాక్ బస్టరైంది ప్రేమలు. అదే సినిమాను తెలుగులో రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తీకేయ రిలీజ్ చేశాడు. రూ.1.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఫస్ట్ వీక్‌లోనే 2కోట్ల షేర్ రాబట్టుకుని లాభాలను తెచ్చిపెట్టింది. సినిమా రన్ టైం ముగిసే సరికి 15-20 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నెక్ట్స్ ఇదే డైరెక్టర్ అండ్ హీరోయిన్ కాంబోలో వచ్చిన బెత్లెహం కుడుంబ యూనిట్‌ను తెలుగులో రిలీజ్ చేస్తోంది మైత్రి మూవీ మేకర్స్. ప్రేమమ్‌తో నివిన్ పౌలీ టాలీవుడ్‌కు తెలిసినా.. థియేటర్స్‌లో రిలీజౌతున్న ఫస్ట్ డబ్బింగ్ ఫిల్మ్ బెత్లెహం కుడుంబ యూనిట్. ఇరుముడి థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్నా.. మరో డబ్బింగ్ సినిమాను తీసుకు వస్తుంది మైత్రి మూవీ మేకర్స్. యాక్చువల్లీ నైజాంలో మలయాళ వర్షన్ రిలీజ్ చేస్తేనే..60 లక్షలు రాబట్టుకుందట. అందుకే డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు ప్రొడ్యూసర్స్. మరీ ప్రేమలులా బెత్లెహం కుడుంబ యూనిట్ ఇక్కడ మాసివ్ కలెక్షన్స్ వసూలు చేస్తుందా..? మమితా బైజుకు మరో డబ్బింగ్ మూవీ ఇక్కడ హిట్ నిస్తుందా..? మైత్రికి మంచి లాభాలను తెచ్చిపెడుతుందా..? లెట్స్ సీ
Also Read
తాజావార్తలు
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
-
Romanchakam Overseas Review : రోమాంచకం ఓవర్సీస్ ప్రీమియర్ రివ్యూ
-
Chamari Athapaththu: కెప్టెన్ సంచలనం.. 5 పరుగులిచ్చి 7 వికెట్లు డౌన్..! హ్యాట్రిక్ కూడాను..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!