Peddi : ‘పెద్ది’తో రామ్‌చరణ్ పాన్ ఇండియా కొట్టాల్సిందే.. లేదంటే అంతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది‘ చిత్రం జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా చరణ్‌కు కేవలం ఒక హిట్ మాత్రమే కాదు ఉత్తరాది మార్కెట్లో సోలో స్టామినాను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టాలీవుడ్ నుంచి అందరికంటే ముందే ‘జంజీర్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు చరణ్. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆయనకు అక్కడ ఆశించిన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ‘RRR’తో గ్లోబల్ స్థాయిలో క్రేజ్ వచ్చినా ఆ విజయంలో సింహభాగం క్రెడిట్ దర్శకుడు రాజమౌళికే దక్కుతుంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడం చరణ్ అభిమానులను కలవరపెట్టింది.
దాంతో ఈసారి ఎలాగైనా నార్త్ బెల్ట్‌లో తన పట్టు నిరూపించుకోవాలని చరణ్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు. అందుకే ‘పెద్ది’ ప్రమోషన్లను నేరుగా ఉత్తరాది నుంచే ప్రారంభించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో భారీ ఎత్తున ‘పెద్ది’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక తెలుగు సినిమా ట్రైలర్‌ను భోపాల్‌లో విడుదల చేయడం ద్వారా హిందీ ఆడియన్స్‌కు దగ్గరవ్వాలనేది మేకర్స్ ప్లాన్. ‘పెద్ది’ చిత్రంలో చరణ్ మాస్ అవతార్‌ను చూస్తుంటే ఇది ఖచ్చితంగా మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనిపిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాతో చరణ్ నిజమైన పాన్ ఇండియా హీరోగా స్థిరపడతారా.. ‘గేమ్ ఛేంజర్’ ఫలితాన్ని మరిపిస్తూ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తారా.. అనేది ఇప్పుడు టాలీవుడ్ మరియు బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!