Anil Ravipudi Movie: అక్కడ సినిమా తీస్తుంది అనిల్.. ఆ ఇద్దరు ప్లాప్ భామలు సక్సెస్ కొట్టినట్టేనా?
- అనిల్ మల్టీస్టారర్ మూవీకి హీరోయిన్స్ సెట్
- వెంకీ, రామ్‌లకు జోడీగా కీర్తి, కృతి
- ఇద్దరు ప్లాప్ భామలు సక్సెస్ కొట్టినట్టే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’తో బ్లాక్ బస్టర్ కొట్టారు. నెక్ట్స్ సినిమా విషయంలో అనిల్ ఇచ్చే అప్డేట్స్ కంటే.. సోషల్ మీడియాలో దొరికే అప్డేట్సే ఎక్కువగా ఉన్నాయి. నెక్ట్స్ సంక్రాంతికి వస్తానని ఆయన జస్ట్ హింట్ ఇచ్చాడంతే. ఇంకేముంది నెట్టింట కథలు కథలుగా కథనాలు పుట్టించేశారు. దీంతో స్వయంగా అనిలే అప్డేట్ ఇవ్వాల్సి వచ్చింది. తనకు దర్శకుడిగా తొలి అవకాశమిచ్చిన కళ్యాణ్ రామ్, ఫస్ట్ హండ్రెడ్ కోర్ అందించిన వెంకటేష్‌తో కొలాబరేట్ అవుతున్నానని ఎనౌన్స్ చేశారు.
అనిల్ రావిపూడి కొత్త సినిమాలో హీరోలు ఎవరో తేలిపోయారు. ఇక వీరికి హీరోయిన్స్ చాయిస్ చెప్పాలిగా. ఈ ఛాన్స్ కూడా అనిల్‌కు ఇవ్వకుండానే సోషల్ మీడియాలో ఈ భామలు ఫిక్స్ అయ్యారంటూ వార్తలొచ్చేస్తున్నాయి. వెంకటేష్‌కు జోడీగా మహానటి కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కు పెయిర్‍గా బేబమ్మ కృతి శెట్టిని ఫిక్స్ చేశారు నెటిజెన్స్. ఏప్రిల్ నుంచే షూట్ మొదలు కావాల్సి ఉన్నా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో జూన్‌లో స్టార్ట్ కానుందని, ఈ మూవీ 2027 పొంగల్‌ను టార్గెట్ చేయబోతుందని తెలుస్తోంది. వెంకీ, కళ్యాణ్ రామ్‌లకు కీర్తి, కృతిని తెస్తాడో లేదో అనిల్ అప్డేట్ ఇస్తాడేమో చూడాలి. ఈ ఇద్దరు ఫిక్సైతే మాత్రం ఫామ్ కోల్పోయిన భామలు సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే.
Also Read
దసరా తర్వాత కీర్తి సురేష్ నటించిన ఏ ఫిల్మ్ హిట్ కాలేదు. తెలుగు, తమిళ్, హిందీలో చక్కర్లు కొడుతున్నా.. సక్సెస్ టెస్ట్ ఇంకా తగలలేదు. భోళా శంకర్‌లో చిరంజీవి చెల్లిగా నటించిన కీర్తి.. మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. ప్రస్తుతం ‘రౌడీ జనార్థనా’ ఒక్కటే ఆమె చేతిలో ఉన్న తెలుగు ప్రాజెక్ట్. ఇక ఉప్పెనతో బేబమ్మగా రిజిస్టరైన కృతి శెట్టి అప్పుడెప్పుడో వచ్చిన బంగ్రారాజుతో హిట్ టెస్ట్ చూసింది. అక్కడ నుంచి వరుస డిజాస్టర్సే. తెలుగులో కూడా ఆఫర్స్ పూర్తిగా నిల్. ఈ టైంలో అనిల్ నుంచి ఛాన్స్ వచ్చిందంటే.. మళ్లీ ఇక్కడ కెరీర్ పుంజుకున్నట్లే. ఈ వార్తలు నిజమైతే.. కీర్తి, కృతిల ఖాతాలో సక్సెస్ పడినట్లే. ఎందుకంటే.. అక్కడ సినిమా తీస్తుంది అనిల్. అనిల్ అంటేనే సక్సెస్.. సక్సెస్ అంటేనే అనిల్ అని టాలీవుడ్‌లో ఓ ముద్ర పడిపోయింది.
తాజావార్తలు
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!