కోలీవుడ్ డైరెక్టర్స్ కంగువా, రెట్రో అంటూ ప్రయోగాలు చేసి వరుస డిజాస్టర్స్ ఇచ్చిన తర్వాత సూర్య తన ఆలోచన మార్చుకొని తమిళ దర్శకులను పక్కన పెట్టి పొరుగు ఇండస్ట్రీ ఫిల్మ్ మేకర్స్‌తో కొలబరేట్ అయ్యాడు. సూర్య కటౌట్ ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేని తమిళ్ డైరెక్టర్స్ సూర్య ఇమేజ్ ని డామేజ్ చేసారు. అందుకే సూర్య ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అని టాక్ నడుస్తోంది. కరుప్పు తర్వాత సూర్య టూ ఫిల్మ్స్ కమిటయ్యాడు. వెంకీ అట్లూరీతో 46వ సినిమా చేస్తుండగా, ఆవేశం ఫేం జీతూ మాధవన్‌తో 47 ఫిల్మ్ కమిటయ్యాడు. రీసెంట్లీ ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. ఇలా పొరుగు దర్శకులకు ఛాన్సులివ్వడం ఓ ఎత్తేతే నెక్ట్స్ బాలీవుడ్ ఫిల్మ్ చేయబోతున్నాడన్నది లేటెస్ట్ బజ్. ఇప్పటికే ముంబయిలో ఫ్యామిలీతో మకాం పెట్టిన సూర్య ఓ బీటౌన్ మేకర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాక్‌తో సూర్య కోలీవుడ్‌తో డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నాడని డిసైడ్ అవుతుంది కే టౌన్.
Also Read : Akhanda2 : ప్రేక్షకులకు అఖండ 2 ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అభ్యర్థన..
తన కన్నా వెనకొచ్చిన శివకార్తీకేయన్, ప్రదీప్ రంగనాథన్, ధనుష్ లాంటి యంగ్ హీరోలు రూ. 300 కోట్లు, హ్యాట్రిక్ హిట్స్, పాన్ ఇండియా స్థాయిలో ఫ్రూవ్ చేసుకుంటే సూర్య మాత్రం రు. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్రాస్ చేయడానికి నానా అవస్థలు పడుతున్నాడు. మొన్న రెట్రో రూ. 250 కోట్లు కొట్టిందని పోస్టర్ అయితే రిలీజౌంది కానీ ఈ నంబర్స్‌ను నమ్మే పరిస్థితులో లేరు ఇండస్ట్రీ జనాలు. అంతకు ముందొచ్చిన కంగువా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దీంతో స్ట్రాటజీ ఛేంజ్ చేశాడు కోలీవుడ్ స్టార్ హీరో. ప్రజెంట్ ఫ్లాపుల్లో ఉన్న కోలీవుడ్ దర్శకులు సుధాకొంగరకు హ్యాండిచ్చి వెట్రి ప్రాజెక్ట్స్ హోల్ట్‌లో పెట్టి అనదర్ లాంగేజ్వ్ దర్శకులకు ఛాన్సులిస్తున్నాడు సూర్య. సూర్య నమ్మకాన్ని వెంకీ, జీతూ ఎంత వరకు నిలబెడతారో చూడాలి.
