టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఎదుగుతోన్న హీరోలు తక్కువే మందే కనిపిస్తారు. అలాంటి వారిలో యునీక్ పీస్ అడవి శేషు. అతను చేసే సినిమాల్లో కంటెంట్ కూడా అంతే యునీక్ గా కనిపిస్తుంది. ‘మేజర్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకున్న శేష్ సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా సెలెక్టివ్‌గా ఉంటున్నాడు. ప్రస్తుతం ‘డెకాయిట్’ చిత్రంతో పాటు ‘గూఢచారి-2’లోను నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాల్లో కొంత భాగం షూట్ తరువాత హీరోయిన్స్ మారిపోవడంతో సినీ పరిశ్రమలో ఏం జరుగుతుందనే టాపిక్ రైజ్ అయ్యింది.
Also Read : Sandal Wood : మరో వివాదం.. కోర్టు మెట్లెక్కిన కన్నడ స్టార్ హీరోయిన్
అడవి శేష్ సరసన ‘డెకాయిట్’ కు శృతిహాసన్‌ను ముందుగా హీరోయిన్‌గా ఎంపిక చేశారు. రెండు షెడ్యూల్స్ తరువాత శృతి ప్లేస్ లోకి మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది. శ్రుతి సైడ్ అవ్వడానికి రీజన్ గా శేషు, శ్రుతిలకు బాండింగ్ సెట్ కాకపోవడమే కారణంగా చూపిస్తున్నారు. నిజానికి శృతిహాసన్ ఈ ప్రాజెక్ట్‌ను ఏదో మొహమాటానికి ఒప్పుకుందని ఆ రీజన్ తోనే ఆ తర్వాత వాకౌట్ చేసినట్లు టాక్. అలాగే ఇదే హీరో నటిస్తున్న ‘గూఢచారి-2’లోను ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ముందుగా ఈ ఫిలింకు హీరోయిన్ గా బంటియా సంధూను తీసుకున్నారు. కొన్ని పర్సనల్ రీజన్స్ తోనే ఆవిడ కూడా తప్పుకుంది. సినిమాకు కీలకంగా మారే భుజ్ షెడ్యూల్‌లోను పాల్గొన్న బంటియా స్థానంలో వామికా గబ్బిని సెలెక్ట్ చేశారు. వామికా గబ్బితో తాజాగా యూరప్ షెడ్యూల్‌ను కూడా పూర్తిచేశారు మేకర్స్. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో పదే పదే హీరోయిన్లు ఎందుకు మారుతున్నారు అనే చర్చ పరిశ్రమలో మొదలైంది.