The Warrior : రామ్ పాటను విడుదల చేయనున్న ‘యూనివర్సల్ కాప్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా అందాల భామ కృతిశెట్టి హీరోయిన్ తెరకెక్కుతున్న సినిమా ‘ది వారియర్’. ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరా రామ్ పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రామ్ సినీ కెరీర్‌లో ఓ మైలురాయిగా గుర్తిండిపోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన బుల్లెట్ లిరికల్ సాంగ్‌కు క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.
ఈ సాంగ్‌లో రామ్, కృతి వేసిన స్టెప్పులు అందరినీ ఆకర్షించాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో సాంగ్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఈ రోజు ‘విజిల్’ అనే సాంగ్ ను హీరో సూర్య చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సాంగ్ డిజిటల్ రిలీజ్ కి హైదరాబాద్ – ఏఎంబీ సినిమాస్ వేదిక కానుండడం విశేషం. ఈ రోజు రాత్రి 7:12 నిమిషాలకు ఈ సాంగ్ ను విడుదల చేయనుంది చిత్రయూనిట్. అయితే.. ఈ సినిమాను జులై 14వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు మేకర్స్.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!