Site icon NTV Telugu

Hot Beautys : ఈ ఇద్దరు టాల్ అండ్ హాట్ ప్లాప్స్ భామలు హిట్ కొట్టేదెప్పుడు..

Pooja Mrunal

Pooja Mrunal

టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఈ ఏడాది కూడా తమ ప్లాప్స్ పరంపరను కంటిన్యూ చేశారు. అలా వైకుంఠపురంతో బుట్టబొమ్మగా రిజిస్టరైన పూజా అయితే అప్పటి నుండి తెలుగులో హిట్టు మొహమే ఎరుగదు. 2022లో వచ్చిన బీస్ట్ తర్వాత ఏ వుడ్ వెళ్లినా డిజాస్టర్లు హాయ్ చెబుతున్నాయి. ఇక సీతామాహాలక్ష్మీ సంగతి చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ స్టార్‌తో తెలుగులో హ్యాట్రిక్ మిస్సైన బ్యూటీతో కూడా సక్సెస్ దోబూచులాడుతోంది.

Also Read : SRK : షారుక్ ఖాన్ బర్త్ డే స్పెషల్.. ‘KING’ టైటిల్ టీజర్ రిలీజ్

పూజా హెగ్డే ఈ ఏడాది టూ ఫిల్మ్స్‌తో పలకరించింది. షాహీద్ కపూర్ దేవాతో పాటు సూర్య రెట్రోలో కనిపించింది. కానీ రెండు ప్లాప్ సినిమాలే. ఇక మూడు నిమిషాలు కనిపించిన కూలీ అయితే శృతి కన్నా ఎక్కువ క్రెడిట్ కొట్టేసింది పూజా. ఇక మృణాల్ ఠాకూర్ నటించిన ఒకే ఒక సినిమా సన్నాఫ్ సర్దార్2. అజయ్ దేవగన్ తో కలిసి నటించిన ఈ సినిమాఆల్ట్రా డిజాస్టర్. ఇక ఈ క్యూటీస్ హోప్స్ అన్నీ నెక్ట్స్ ఇయర్ వచ్చే సినిమాలపైనే. బీస్ట్ తర్వాత హిట్ చూడని పూజా హెగ్డే మళ్లీ ఇళయదళపతి విజయ్‌తో జననాయగన్ చేస్తోంది. జనవరి 9న వస్తున్న ఈ సినిమా రికార్డుల మోత మోగించడం ఖాయమంటోన్నారు. టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్న దుల్కర్41పై కూడా హోప్స్ ఉన్నాయి. మృణాల్ బాలీవుడ్, టాలీవుడ్ లెక్కలు బైలింగ్వల్ ఫిల్మ్ డెకాయిట్‌ పైనే. ఇక ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న హై జవానీ తో ఇష్క్ హోనా హై లైన్లో ఉంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ ఫిల్మ్ జూన్5న థియేటర్లలో సందడి చేయబోతోంది. మరి ఏ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతారో చూడాలి.

Exit mobile version