ఈ ఏడాది బిగ్ రిలీజ్ సినిమాల్లో ఒకటి వార్ 2. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన వార్ 2 సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి హిందీలో పూర్తి స్థాయి పాత్రలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో YRF స్పై యూనివర్స్‌లో రూపొందిన ఈ హై-ఎనర్జీ థ్రిల్లర్‌లో కియారా అద్వానీ కీలక పాత్రలో కనిపించనుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 5,000 స్క్రీన్‌లపై విడుదలవుతున్న ఈ సినిమా 2D, IMAX 2D, 4DX ఫార్మాట్‌లలో అందుబాటులో ఉంటుంది.
Also Read:WAR 2 : జూనియర్ ఎన్టీఆర్ చెప్పింది నిజమేనా..?
ఆగస్టు 10 అర్ధరాత్రి నుంచి BookMyShow, PayTMలో టిక్కెట్ల బుకింగ్ జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానుల ఉత్సాహంతో ఉదయం 4 గంటల షోలకు డిమాండ్ పెరిగింది, కానీ YRF మాత్రం దేశం అంతా ఒకటే సమయానికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. తెలుగు వెర్షన్ డబ్బింగ్‌గా ఉన్నప్పటికీ, స్టార్ క్యాస్ట్ భారీ ప్రమోషన్లతో వార్ 2 బాక్సాఫీస్‌ను శాసించే అవకాశం ఉంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూలీతో ఈ చిత్రం ఢీకొట్టనుంది. ముందస్తు షోలపై నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉన్నా, వార్ 2 సంచలనం సృష్టించడం ఖాయం!
