Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Chaitanya’s Vrushakarma Official Trailer: అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా, దర్శకుడు కార్తీక్ వర్మ దండు కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వృషకర్మ’. లక్కీ చార్మ్ మీనాక్షి చౌదరి హీరోయిన్. ‘విరూపాక్ష’తో ఆకట్టుకున్న కార్తీక్ ఈసారి మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 4న వృషకర్మ థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది.
బుధవారం రాత్రి నెల్లూరులోని నార్త్ రాజుపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో వృషకర్మ ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు. అక్కడ అభిమానుల కోసం ట్రైలర్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. అయితే ఈవెంట్లో ట్రైలర్ విడుదల చేసినప్పటికీ.. వెంటనే ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో అందుబాటులోకి రాలేదు. తాజాగా నాగచైతన్య తన ఎక్స్ ఖాతా ద్వారా ట్రైలర్‌ను అభిమానులతో పంచుకున్నారు. 2 నిమిషాల 56 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తికరమైన డైలాగ్‌తో ప్రారంభమైంది. ‘అతీంద్ర శక్తి తన బలిని ఎందుకుంది?’ అనే ప్రశ్నతో కథపై ఆసక్తి పెంచారు. ‘సృష్టి ధర్మాన్ని కాపాడటం కోసం సాక్షాత్తు ఆ దైవమే ఎంచుకున్న వృషకర్మవి నువ్వే’ అనే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Also Read
- Varanasi Release Date: వారణాసి విడుదలపై ఉత్కంఠ.. ఏప్రిల్ 7న రావడం కష్టమేనా?.. రాజమౌళి కీలక నిర్ణయం!
- Anirudh-Jonita Gandhi: మాజీ ప్రేయసిని రిసెప్షన్‌కు పిలిచాడు.. ఎంత మంది ఉంటారు ఇలా.. అనిరుధ్ సర్ గ్రేట్!
- Kavya Maran - Anirudh: ఉద్యోగులతో కలిసి కావ్య మారన్, అనిరుధ్ స్పెషల్ లంచ్.. విందులో అదిరిపోయే మెనూ..!
- Chahal-Dhanashree: బీజేపీలోకి చహల్.. తెలుగు హీరోయిన్గా ధనశ్రీ.. విడాకుల తర్వాత కొత్త ఇన్నింగ్స్!
ట్రైలర్‌లోని మిగతా సంభాషణలు, యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఇప్పటివరకు తెలుగు తెరపై పెద్దగా స్పృశించని నేపథ్యంలో వృషకర్మను తెరకెక్కిస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలను కలిపి దర్శకుడు కార్తీక్ దండు ఓ ఆసక్తికరమైన కథను సిద్ధం చేసినట్లు ప్రచార చిత్రం సూచిస్తోంది. నాగచైతన్య గతంలో చెప్పినట్లుగానే ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. విజువల్స్, బ్యాక్‌డ్రాప్, డైలాగ్స్ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. వృషకర్మ ట్రైలర్‌తో నాగచైతన్య మరో కొత్త జానర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే సంకేతాలు ఇచ్చారు. ట్రైలర్‌తో అంచనాలు పీక్స్‌కు చేరాయి. మరి ఈ అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుందన్నది చూడాలి.
Here it is, the #VrushakarmaTrailer!
I’ve been waiting to share this with you all. I’m grateful I got to play a part in a film this ambitious. This one is super close to my heart, and I can’t wait for you to experience it on the big screen. ❤️
https://t.co/g2WkO563Xq
Please do experience it with the best sound and visual equipment available to you . My sincere apologies on the delay .. thankful for all your patience and support .
#VrushakarmaOnDec4
@karthikdandu86 @Meenakshiioffl @BvsnP @aryasukku #SparshShrivastava @AJANEESHB #RagulDHerian @Srinagendra_Art @NavinNooli @SVCCofficial @SukumarWritings @ivyofficial2023
— chaitanya akkineni (@chay_akkineni) November 26, 2026
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!
-
Kishan Reddy: ప్రచారం కోసమో, లైక్‌ల కోసమో యాత్ర చేయడం లేదు.. ‘నషా ముక్త్ భారత్’పై కేంద్ర మంత్రి..
-
Gold Rate Today: నిన్న తగ్గినట్టే తగ్గి.. నేడు మళ్లీ షాక్! భారీగా పెరిగిన బంగారం ధరలు
-
Varanasi Release Date: వారణాసి విడుదలపై ఉత్కంఠ.. ఏప్రిల్ 7న రావడం కష్టమేనా?.. రాజమౌళి కీలక నిర్ణయం!
-
Indian Constitution Day 2026: భారత ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం అమూల్యమైన సంపద.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Cricket Video: బైక్‌పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!
-
9,530mAh బ్యాటరీ, 108MP కెమెరాతో Honor Magic 9 Lite+ 5G..!
-
Wiaan Mulder History: ట్రిపుల్ సెంచరీ.. సెంచరీ, 7 వికెట్లు.. 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్‌తో Motorola Razr 2027..!