Karthik Dandu: డిసెంబర్ 4న తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సినిమా రాబోతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthik Dandu: ‘విరూపాక్ష’ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత డైరెక్టర్ కార్తీక్ దండు, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్లో వస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డిసెంబర్ 4న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రబృందం గ్రాండ్‌గా మీడియా మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్ కార్తీక్ దండు.. డిసెంబర్ 4న తెలుగు ఇండస్ట్రీ గర్వపడే ఒక గొప్ప సినిమాను ఇవ్వబోతున్నామని బలంగా చెప్పారు.
ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూశాక తమపై బాధ్యత మరింత పెరిగిందని, కచ్చితంగా అంతకుమించి సినిమా ఉంటుందని కార్తీక్ ధీమా వ్యక్తం చేశారు. మొదట నాగచైతన్యకు ఈ కథ చెప్పినప్పటి విషయాన్ని గుర్తుచేసుకుంటూ.. “కథ మొత్తం విన్నాక ఈ సినిమా చేయాలని చైతు గారు ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత ఆయన నాతో ఒక మాట అన్నారు.. ‘ఈ సినిమాలో నేను హీరో అనే విషయాన్ని పక్కనపెడితే, ఇండియా గర్వపడే ఒక సినిమా చేయబోతున్నాం. అలాంటి సినిమాలో నేను భాగమవుతున్నందుకు చాలా పాజిటివ్‌గా ఉంది, దీన్ని ఎలాగైనా సాధించాలి’ అన్నారు. డిసెంబర్ 4న తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక మంచి సినిమా ఇచ్చామని మేము గర్వంగా చెప్పుకుంటాం” అని అన్నారు. ఇక నాగార్జున ప్రస్తావన రాగా.. ఆ విషయాలు కింగ్ చెప్తేనే బాగుంటాయని, ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన చేతే చెప్పించుకుందామని ఆసక్తికర హింట్ ఇచ్చారు.
Also Read
- Dada Movie: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా!
- Crazy Crossover: సూర్య కోసం మమిత 'ప్రేమలు'కు బ్రేకప్.. ప్రతీకారం తీర్చుకోవడానికే 'సీన్'లోకి నస్లెన్!
- Bunny Vasu: నిర్మాతల చేతుల్లో రిలీజ్ డేట్లు లేవు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?
- Kaaka Movie: 'కాకా' నైజాం రైట్స్ ఆ సంస్థకే.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
సినిమా కోసం రక్తం, చెమట ధారపోశామని సాధారణంగా అంటుంటారు కానీ, నిజంగానే ఈ సినిమా కోసం నటీనటులు, టెక్నీషియన్లు మూడేన్నరేళ్ల పాటు ప్రాణం పెట్టి పనిచేశారని కార్తీక్ చెప్పారు. మల్టీ-లేయర్డ్ నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేతో ఒక సరికొత్త కథను తెరపైకి తెస్తున్నామని, ఇది కచ్చితంగా థియేటర్లలోనే చూడాల్సిన సినిమా అని స్పష్టం చేశారు. ‘విరూపాక్ష’ ఒక రకమైన హారర్ అయితే, ‘వృషకర్మ’ మరో భిన్నమైన హారర్ జానర్ అని.. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులకు ఒక రకమైన ఆందోళన (అన్ఈజీ ఎక్స్పీరియన్స్), కొన్ని సీన్లలో అడ్రినలిన్ రష్ కలుగుతాయని ఛాలెంజ్ చేశారు. అలాగే సీక్వెల్స్ గురించి మాట్లాడుతూ.. అన్ని పార్ట్-2 సినిమాలు కచ్చితంగా వస్తాయని, ఎవరూ కంగారు పడొద్దని ఫ్యాన్స్‌కు భరోసా ఇచ్చారు. ఈ చిత్రంలో స్పర్ష్, జయరామ్, కియారా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Karthik Dandu: డిసెంబర్ 4న తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సినిమా రాబోతోంది..
-
Telangana IAS Transfers : తెలంగాణలో కీలక ఐఏఎస్‌ల బదిలీలు.. హెచ్ఎండీఏ, మెట్రోకు కొత్త బాస్‌లు
-
Dada Movie: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. కరువు, తుఫాన్ల బాధిత రైతులకు రూ.2,459 కోట్ల పరిహారం..
-
Crazy Crossover: సూర్య కోసం మమిత ‘ప్రేమలు’కు బ్రేకప్.. ప్రతీకారం తీర్చుకోవడానికే ‘సీన్’లోకి నస్లెన్!
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!