రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్, ట్రైలర్ కు భారీ స్పందన వచ్చింది.
Also Read : NBK 111 : బాలయ్య – గోపీచంద్ మలినేని.. రెడీ ఫర్ యాక్షన్
రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని సంగీత దర్శకుడు తమన్ ఆ మధ్య హింట్ ఇచ్చాడు కానీ ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా జస్ట్ పోస్టర్ తో సరిపెట్టారు మేకర్స్. దాంతో ఫ్యాన్స్ కాస్త డిజప్పోయింట్ అయ్యారు. కనీసం ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందని డేట్ కూడా చెప్పలేదని సొషల్ మీడియాలో కామెంట్స్ చేసారు. తాజాగా పీపుల్స్ మీడియా నిర్మించిన మరో సినిమా మోగ్లీ ఫస్ట్ సింగిల్ లాంచ్ లో నిర్మాత విశ్వప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడూతూ’ రాజసాబ్ ఫస్ట్ సింగిల్ ను నవంబరు 5న రిలీజ్ చేస్తాము. అలాగే జనవరి 9న వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ కు ముందు రాజాసాబ్ సెకండ్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తాం’ అని అన్నారు. రెబెల్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఫస్ట్ సింగిల్ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.