మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్ సోషియో ఫాంటాషి సినిమా ‘విశ్వంభర’. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అనుకోని కారణాల వలన షూటింగ్ డిలే అవుతూ వస్తున్న ఈ సినిమా స్పెషల్ సాంగ్ షూటింగ్ ను ఇటీవల ఫినిష్ చేసారు. మౌని రేయ్ చిరు సరసన స్టెప్పులేస్తోంది. దాంతో షూటింగ్ మొత్తం కంప్లిట్ అయింది.
Also Read : Venkaiah Naidu: వీఐపీలు ఏడాదికి ఒక్కసారే శ్రీవారి దర్శనానికి రావాలి..!
ఎప్పుడో విడుదల కావాల్సిన విశ్వంభర విఎఫెక్స్ వర్క్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. విశ్వంభర రిలీజ్ కు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని రీ వర్క్ చేస్తున్నారు. దాదాపు రూ. 75 కోట్లు విఎఫెక్స్ కోసం ఖర్చు పెడుతోంది. ఇదిలా ఉండగా విఎఫెక్స్ వర్క్ ఆగస్టు చివరి నాటికి ఫినిష్ అవుతుందని సెప్టెంబర్ 25 న విశ్వంభర రిలీజ్ అని టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పటికే అదే డేట్ కు బాలయ్య -బోయపాటిల అఖండ 2, పవర్ స్టార్ OG రెడీ గా ఉన్నాయి. దాంతో ఆ రెండు సినిమాలతో పోటీ ఎందుకు అందుకున్నారో ఏమో విశ్వంభరను మరోసారి వాయిదా వేసేందుకు రెడీ అయ్యారు. అటు VFX వర్క్ కూడా సెప్టెంబర్ నాటికి ఫినిష్ అవదు అని టాక్ కూడా ఉంది. దాంతో విశ్వంభర సెప్టెంబర్ రేస్ నుండి తప్పుకుని డిసెంబరుకు వెళ్తోంది. అక్కడ ముందే కర్చీఫ్ వేసుకుని ఉన్న రాజాసాబ్ సంక్రాంతికి వెళ్లే అవకాశం ఉంది.