Vishwak Sen: తరుణ్ భాస్కర్‌ను ‘ఫలక్‌నుమా దాస్’ కోసం 3 నెలలు అడుక్కున్నా..: విశ్వక్ సేన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను యాక్టర్‌గా మార్చడానికి తాను ఎంతగా కష్టపడాల్సి వచ్చిందో హీరో విశ్వక్ సేన్ సరదాగా గుర్తుచేసుకున్నారు. ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ కోసం తరుణ్ భాస్కర్‌ను ఏకంగా మూడు నెలల పాటు అడుక్కున్నానని విశ్వక్ చెప్పారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ.. “ఫలక్‌నుమా దాస్ షూటింగ్ మొదలైనప్పుడు తరుణ్‌తో పోలీస్ క్యారెక్టర్ చేయించాలనుకున్నాను. కానీ ఎన్నిసార్లు అడిగినా ‘నేను యాక్టింగ్ చేయనురా బాబు’ అంటూ తప్పించుకునేవాడు. దాంతో ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను నెలల తరబడి వాయిదా వేస్తూ వచ్చాం. ఓరోజు రామానాయుడు స్టూడియోలో ఫోటోషూట్‌లో ఉన్న తరుణ్ దగ్గరికి వెళ్లి, చేతిలో బిస్కెట్ పెట్టి మరీ బతిమిలాడాను. నేను వదిలేలా లేనని అర్థమై చివరకు ఆ రోజు సాయంత్రానికి ఓకే చెప్పాడు” అని విశ్వక్ వివరించారు.
అప్పట్లో నటించమంటే ప్రాణం మీదికి తెచ్చుకున్న తరుణ్, ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తుండటంపై విశ్వక్ చమత్కరించారు. “అప్పుడేమో అంతలా బతిమిలాడినా చేయనన్నాడు.. ఇప్పుడేమో వరుసగా సినిమాలు చేస్తూ ఎక్కడా ఆపేలా కనిపించట్లేదు. ఎవరైనా వచ్చి అమాయకంగా ముఖం పెట్టి అడిగితే కాదనలేక ఒప్పుకునే మనస్తత్వం తరుణ్‌ది. అందుకే ఇప్పుడు చాలామంది ఆయనతో నటింపజేస్తున్నారనిపిస్తోంది. పైగా కాదనలేని క్రేజీ ఆఫర్లు కూడా ఆయనకు వస్తున్నాయి” అని విశ్వక్ సేన్ నవ్వుతూ చెప్పుకొచ్చారు. డైరెక్టర్‌గా నేషనల్ అవార్డు అందుకున్న తరుణ్ భాస్కర్, ‘ఫలక్‌నుమా దాస్’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ టైమ్ యాక్టర్‌గా దూసుకుపోతున్నారు.
Also Read
- The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో 'ది ప్యారడైజ్'!
- AK 47: 'ఆదర్శ కుటుంబం'పై తగ్గిన క్రేజ్.. తమన్ పాటలతో మరింత డౌన్.. ఇక ట్రైలర్‌పైనే ఆశలు!
- Kalki 2: భైరవ ఈజ్ బ్యాక్.. ప్రభాస్ బర్త్‌డే స్పెషల్..! ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే మేకింగ్ వీడియో..
- Kajal Aggarwal-Ramayana: 'రామాయణ'లో చందమామ ఉందా?.. సీన్స్ తీసేశారా?
తాజావార్తలు
-
Vishwak Sen: తరుణ్ భాస్కర్‌ను ‘ఫలక్‌నుమా దాస్’ కోసం 3 నెలలు అడుక్కున్నా..: విశ్వక్ సేన్
-
AP Election Commission: నామినేషన్లపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు మరో అవకాశం
-
AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
-
Bihar: తల్లి కోసం కొడుకు సంకల్పం.. పరుగెత్తుకుంటూ 12 జ్యోతిర్లింగాల యాత్ర
-
Vidadala Rajini: విడదల రజిని ఇంటి వద్ద హైటెన్షన్.. ఎస్సై చర్యతో కిందపడ్డ మాజీ మంత్రి..
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!