Vishwak Sen: పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరే.. విశ్వక్ ఎమోషనల్ స్పీచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishwak Sen: ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో హీరో విశ్వక్ సేన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ లేకపోతే అసలు తాను ఇండస్ట్రీలో ఉండేవాడినే కాదని చెబుతూ, కెరీర్ తొలినాళ్లలో తనను తొక్కేయడానికి జరిగిన ఒక భయంకరమైన కుట్రను ఆయన ఈ వేదికపై బయటపెట్టారు. పాతాళంలోకి వెళ్లిపోతున్న తనను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరేనని విశ్వక్ కన్నీటి పర్యంతమయ్యారు.
8 ఏళ్ల క్రితం ‘ఈ నగరానికి ఏమైంది’ మొదటి భాగానికి సెలెక్ట్ అయిన తర్వాత తనపై జరిగిన ఒక కుట్రను విశ్వక్ గుర్తుచేసుకున్నారు. గతంలో కాలేజీలో తనతో గొడవపడిన ఒక కుర్రాడు, ఆడిషన్లలో రిజెక్ట్ అయిన కక్షతో ఒక అమ్మాయి పేరుతో ఫేక్ జీమెయిల్ ఐడీ క్రియేట్ చేసి తరుణ్ భాస్కర్‌కు మెయిల్ పంపాడట. “విశ్వక్ నాతో చాలా తప్పుగా ప్రవర్తించాడు.. అతడిని సినిమాలో పెట్టుకుంటే మీడియాకు వెళ్లి మీ సినిమా పరువు తీస్తా” అంటూ అందులో బెదిరించారని విశ్వక్ తెలిపారు.
Also Read
- Abhinav Gomatam: నెలకి 30 వేల జాబ్ వదిలేసి ఏడాదికి 30 వేలే సంపాదించా.. అన్నీ అవమానాలే
- Naga Chaitanya: నా మౌనాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు
- RC 17 : రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది!
- Nagarjuna King 100: నో పోస్ట్‌పోన్.. అనుకున్న డేట్‌కే బాక్సాఫీస్ వేటకు వస్తున్న ‘కింగ్’ నాగార్జున!
ఆ మెయిల్ చూసి తరుణ్ భాస్కర్ మొదట తనను సినిమాలోంచి తీసేశారని, కానీ ఆ నింద తన జీవితాంతం వెంటాడుతుందని భయపడి తాను తరుణ్‌ను బతిమాలానని చెప్పారు. “నాకు సినిమా వద్దు, కానీ ఆ మెయిల్ నాకు పంపించు.. నేను నిర్దోషినని నిరూపించుకుంటాను అని అడిగాను. ఆ రోజు తరుణ్ నా మాట నమ్మి ఆ మెయిల్ పంపించాడు. 24 గంటల్లోనే అది ఆ కుర్రాడు చేసిన ఫేక్ పని అని తేలిపోయింది. ఆ రోజు తరుణ్ గనుక నన్ను నమ్మకపోయి ఉంటే నా జీవితం ఏమైపోయేదో తెలియదు. పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరే. నా కన్నతల్లిదండ్రులు, మా అక్క నాకు 50 శాతం సంస్కారం నేర్పిస్తే, మిగిలిన 50 శాతం తరుణ్ దగ్గరే నేర్చుకున్నాను. హి ఈజ్ మై బ్లడ్ బ్రదర్” అని విశ్వక్ ఎమోషనల్ అయ్యారు.
అంతకుముందు 17 ఏళ్ల వయసులోనే కృష్ణానగర్ ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలుపెట్టానని విశ్వక్ తెలిపారు. 21 ఏళ్ల వయసులో అప్పులు ఉన్నాయని ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్లిపోయినప్పుడు కూడా తాను ఏడవలేదని, కానీ ఒక సినిమా ఆఫీసులో జరిగిన అవమానం తట్టుకోలేక మూడు రాత్రులు ఎక్కిఎక్కి ఏడ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమాలో మెయిన్ హీరోగా తీసుకుని, నాలుగో హీరోగా మార్చడమే కాకుండా.. చివరికి సినిమాలోంచి తీసేసిన విషయం కూడా చెప్పకుండా 20 రోజులు ఆఫీసు చుట్టూ తిప్పుకున్నారని వాపోయారు. చేతిలో డబ్బులు లేకపోయినా అప్పులు చేసి ఆఫీసు వాళ్లకు పార్టీలు ఇప్పించానని, తీరా 20 రోజుల తర్వాత వేరే కుర్రాడిని పెట్టి తనను ఎప్పుడో తీసేశామని చెప్పడంతో తట్టుకోలేకపోయానని గుర్తుచేసుకున్నారు.
ఇండస్ట్రీలో రెండు ఫ్లాపులు రాగానే జనాలు చూసే చూపు మారిపోతుందని, సోషల్ మీడియా ట్రోల్స్ చూసి తన కుటుంబ సభ్యులు బాధపడుతుంటారని విశ్వక్ ఆవేదన చెందారు. అయితే, మళ్లీ పడిపోతున్న తనను ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’తో తరుణ్ భాస్కర్ నిలబెట్టారని కృతజ్ఞతలు తెలిపారు. యూఎస్‌లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం, వరల్డ్ వైడ్‌గా రూ.50 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టబోతోందని, తన కెరీర్లో ఇదే తొలి రూ.50 కోట్ల సినిమా అని సంతోషం వ్యక్తం చేశారు. చివరగా, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, ఎడిటర్ రవితేజ గిరిజాలతో కలిసి త్వరలోనే ‘ఫలక్‌నుమా దాస్ 2’ కూడా చేయబోతున్నట్లు ప్రకటించడంతో ఆడిటోరియం దద్దరిల్లింది.
తాజావార్తలు
-
Vishwak Sen: పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరే.. విశ్వక్ ఎమోషనల్ స్పీచ్!
-
Abhinav Gomatam: నెలకి 30 వేల జాబ్ వదిలేసి ఏడాదికి 30 వేలే సంపాదించా.. అన్నీ అవమానాలే
-
Naga Chaitanya: నా మౌనాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు
-
RC 17 : రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది!
-
Thiruparankundram: సుప్రీం ఆదేశాలున్నా ‘దీపతూన్’ వద్ద వెలగని కార్తీక దీపం.. తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!