Vishnu Priya Intresting Comments on Reethu Chowdary: రీతూ చౌదరి తన జీవితంలోకి వచ్చాక తనకు పొట్ట పెరిగిపోయింది అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది విష్ణు ప్రియ. వీరిద్దరూ మాటీవీలో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ అనే ఒక స్పెషల్ షోలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ షో కి సంబంధించి ఎన్టీవీ ఒక స్పెషల్ చిట్ చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విష్ణుప్రియ రీతు చౌదరి ఇద్దరు తమ జీవితాలకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే విష్ణు ప్రియ మాట్లాడుతూ తాను ఒక తుప్పు పట్టిన పీస్ అని చెప్పుకొచ్చింది. ఇదైతే తక్కువలో వచ్చేస్తుందని నన్ను అడిగారు.
Nagababu: అల్లు vs మెగా వివాదం.. వెయిటింగ్ అంటూ నాగబాబు కీలక వ్యాఖ్య
అయితే రీతు మాత్రం ఒక టాక్ షో ద్వారా మంచి ఫేమస్ అయింది. ఆమెకు మాత్రం మంచి ప్యాకేజీ ఇచ్చినట్టు ఉన్నారని కామెంట్ చేసింది. అయితే ఇంత బోల్డ్ గా మాట్లాడుతున్నారు ఏమిటి? అని అడిగితే విష్ణుప్రియలో తనకు నచ్చిన క్వాలిటీ అదేనని రీతు చౌదరి చెప్పుకొచ్చింది. అయితే కొన్ని విషయాలను బయట చెప్పవద్దు అని చెప్పి విష్ణుప్రియకి నేను చెబుతూ ఉంటాను అని రీతూ చౌదరి చెప్పుకొచ్చింది. అప్పుడు విష్ణు ప్రియ అవును నిజమే అది చెప్పినది బయటికి చెప్పలేక లోపల ఉంచుకోలేక ఇబ్బంది పడుతున్నాను. అందుకే నాకు ఇంత పొట్ట వచ్చేసింది ఇది వచ్చిన తర్వాత నాకు ఇంత పొట్ట పెరిగిపోయింది అంటూ ఆమె కామెంట్ చేసింది.