తెలుగు బుల్లితెరపై అత్యధిక పాపులారిటీ సాధించిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ ప్రస్తుతం తన తొమ్మిదవ సీజన్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి ఏడాది కంటే ఈసారి కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేసిన ఈ షోలో 13 మంది కంటెస్టెంట్లు హౌస్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ హైప్లో మధ్యలో, మాజీ కంటెస్టెంట్ యాంకర్ విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెలివిజన్‌లో ‘పోవే పోరా’ వంటి షోల ద్వారా ప్రేక్షకులను అలరించిన విష్ణుప్రియకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. గ్లామరస్ ఫోటోషూట్స్, సోషల్ మీడియాలో యాక్టివ్ ప్రెజెన్స్‌తో ఫ్యాన్స్‌కి దగ్గరైంది. గతంలో బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన విష్ణుప్రియ అక్కడ పృథ్వీతో స్నేహం, కెమిస్ట్రీ కారణంగా పెద్ద చర్చకు దారితీసింది.
Also Read : Mithra Mandali : “మిత్ర మండలి” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణుప్రియ తన బిగ్‌బాస్ అనుభవం గురించి ఓపెన్‌గా మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. “నేను బిగ్‌బాస్ షోకు డబ్బుల కోసమే వెళ్లాను. కొత్త ఇల్లు కట్టుకోవచ్చని అనుకున్నా.. కానీ అది జరగలేదు. ఇప్పటికీ పాత ఇంట్లోనే ఉన్నాను. బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లడం నా జీవితంలో తీసుకున్న తప్పు నిర్ణయం. బిగ్‌బాస్ నుంచి నేను ఏమి నేర్చుకోలేకపోయాను. మళ్లీ ఆ షో నుంచి కాల్ వచ్చినా వెళ్లను. ఒక్కసారి వెళ్లినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. ఎందుకు వెళ్లాను అనిపించింది. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అనిపించింది” అని చెప్పింది. విష్ణుప్రియ ఈ విధంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరు ఆమె నిజాయితీని మెచ్చుకుంటుంటే, మరికొందరు “ఇలా చెప్పాల్సిన అవసరముందా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా, ఆమె ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి.