మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్ష పదవికి ఈసారి గట్టి పోటీనే ఎదురైయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటికే పోటీదారుల ప్రెస్ మీట్లతో టాలీవుడ్ లోని లుకలుకలు బయటపడ్డాయి. తాజాగా మంచు విష్ణు ఈ ఏడాది జరగనున్న ‘మా’ అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేస్తున్నానని లేఖ ద్వారా తెలియజేశాడు. తెలుగు సినీ పరిశ్రమ రుణం తీర్చుకొనేలా సేవ చేయడమే నా కర్తవ్యం అంటూ లేఖలో పేర్కొన్నారు. మా నాన్న ‘మా’ అధ్యక్షుడిగా చేసిన సేవలు, అనుభవాలు తనకు మార్గదర్శకాలు అని తెలిపారు. మా సభ్యుల అవసరాలపై అవగాహన, అనుభవం వుందని.. గతంలో ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా చేసిన అనుభవం కూడా ఉందని గుర్తుచేశాడు. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం. కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా ఉంటాను. ‘మా’ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా నా సేవలు సంపూర్ణంగా అందించాలనుకుంటున్నాను అంటూ విష్ణు లేఖలో తెలిపారు.